Advertisement

  • రాముడు అందరి వాడు , అందరిలో ఉన్నాడు ..ప్రధాని మోడీ

రాముడు అందరి వాడు , అందరిలో ఉన్నాడు ..ప్రధాని మోడీ

By: Sankar Wed, 05 Aug 2020 2:28 PM

రాముడు అందరి వాడు , అందరిలో ఉన్నాడు ..ప్రధాని మోడీ



మన చుట్టూ రాముడు ఉన్నాడు అన్నాడు అన్నారు ప్రధాని మోడీ ..దేశ జాతిపిత మహాత్మ గాంధీ యొక్క అహింస నినాదానంలో కూడా శ్రీరాముడు ఉన్నాడు ..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఈ రోజు సంతోషంగా ఉన్నారు ..రాముడు అందరి వాడు , అందరిలోనూ ఉన్నాడు ..మాతృభూమి స్వర్గం లాంటిది అని చెపింది రాముడే అని అన్నాడు ప్రధాని.జనని జన్మ భూమిశ్చ రాముడి నినాదం అన్నారు మోడీ ..

రాముడు ఆదర్శానికి మార్గనిర్దేశకుడు ..రాముడు విధి నిర్వహణ ఎలా చేయాలో చేసి చూయించాడు....యుగ యుగాలకు మానవులకు రామ్ మందిరం ప్రేరణ ఇస్తుంది అన్నారు మోడీ..ఇక ఈ సందర్భంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ..'ఐదు శతాబ్దాల నిరీక్షణ ముగిసింది. రామమందిరం భూమి పూజలో పాల్గొనడం మా అదృష్టం. ఆలయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాం. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా కల సాకారమైంది. ప్రపంచంలోనే అయోధ్య విశిష్ట నగరంగా రూపుదిద్దుకోబోతుంది. ఎందరో త్యాగాల ఫలితమిది' అంటూ చెప్పుకొచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా దశాబ్ధాల కల నెరవేరిన ఆనందం కనిపిస్తోంది. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. అందరూ ఈ వేదికపై లేకపోవచ్చు.. రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీ పాత్ర ఎనలేనిది. రామమందిరం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతాయి. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ద్వేషాలు, పాపాల నుంచి దూరంగా.. సర్వమానవ సమాజం కోసం తమకు తాము తయారుచేసుకోవాలి. విశ్వమానవాళికి మార్గదర్శం చేయదగ్గ భవ్యమైన రామమందిరం రూపుదిద్దుకోబోతుంది' అంటూ మోహన్ భగవత్ వెల్లడించారు

Tags :
|

Advertisement