Advertisement

క్రికెట్లో లోకేశ్‌ రాహుల్‌ ప్రస్థానం

By: Dimple Sat, 15 Aug 2020 12:12 PM

క్రికెట్లో లోకేశ్‌ రాహుల్‌ ప్రస్థానం

విద్యావంతుడు... ప్రతిభావంతుడు... ఆటలో నేర్పరి... లోకేశ్‌ రాహుల్... బాధ్యతాయుతమైన ఆటతీరు... కలిసొచ్చిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుని... సత్తాచాటుతున్నాడు.... బ్యాటింగ్‌లో తిరుగులేదనే పేరు సొంతంచేసుకుని కోట్ల మంది అభిమానులకు చేరువయ్యాడు. ఉన్నతచదువుతో ఉద్యోగం చేసుకుని జీవితంలో హాయిగా స్థిరపడుతాడని తల్లిదండ్రుల భావన. క్రికెట్‌ పట్ల ఆసక్తితో బ్యాట్‌ చేతబూని.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతంచేసుకున్నాడు. దుబాయ్‌ వేదికలపై జరిగే ఐపీఎల్‌ మ్యాచుల్లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు కెప్టన్‌గా వ్యవహరిస్తున్నాడు. కర్ణాటకప్రాంతానికి చెందిన కన్నూరు లోకేశ్‌ రాహుల్‌ క్రికెట్‌ ప్రస్థానం... సాధించిన రికార్డుల్ని ఓసారి చూద్ధాం..!

విద్యావంతుల కుటుంబంలో పుట్టిన లోకేశ్‌ రాహుల్ చిన్నప్పటినుంచి చురుకైన వ్యక్తి. ప్రతిభావంతుడు.. తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులుకావడం... బిడ్డ ఉజ్వల భవిష్యత్తుకోసం.. ప్రత్యేకశ్రద్ధతీసుకున్నారు. డిగ్రీ పట్టభద్రుడైన రాహుల్‌... చదువుకునే రోజులల్లో... రాహుల్‌ ద్రావిడ్‌... ఎబి డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ శైలినిచూసి క్రికెట్‌ పట్లమక్కువ పెంచుకున్నాడు. ఇష్టప్రకారం...ఎంచుకున్న మార్గంలో ఖచ్చితంగా రాణిస్తాననే విశ్వాసం ఉంటే వెనుకడుగు వేయవద్దని అమ్మానాన్నలు ఆశీర్వదించారు. దాంతో ఎంతో ఇష్టంగా ఎంచుకున్న క్రికెట్‌ కెరీర్‌లో రాణించేందుకు శ్రమించిన రాహుల్... అండర్‌ 19 జట్టుకు 2010-11 సీజన్లో కర్ణాటక ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ లోకి కాలుమోపాడు. ఆతర్వాతి సీజన్‌లో వెనుకడుగేసి... 2012-13 సీజన్‌ తిరిగి ప్రవేశించి పరుగుల సాధనలో సత్తా చాటాడు.

యువజట్టులో రాణిస్తున్న రాహుల్‌...ను టీమిండియాలోకి తీసుకోడానికి సెలక్టర్లు తర్జన భర్జన పడ్డారు. 2013లో కోల్కతానైట్‌ రైడర్స్‌ జట్టుతో తలపడిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చిన్నస్వామిస్టేడియంలో జరిగిన క్రికెట్‌ మ్యాట్‌లో ఆరంగేట్రం చేసి సత్తా చాటే ప్రయత్నంచేశాడు. ప్రారంభ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. అయితే తర్వాత మ్యాచుల్లో తన ఆటతీరుతో అందరిదృష్టి తనవైపు మళ్లించేలా చేశాడు. ఆటలో చురుగ్గా వ్యవహరిస్తున్న రాహుల్‌ను టీమిండియాలోకి తీసుకుని 2014లో టెస్టు క్రికెట్‌ మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో ఆడే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. మెల్‌ బోర్న్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్‌లో ఆరంగేట్రం చేశాడు. ఆతర్వాత 2016లో జింబాబ్వే.. వన్డే... టీ20 మ్యాచుల్లో ఆడే అవకాశం కల్పించారు.... ఆతర్వాత రాహుల్‌ తన క్రికెట్‌ కెరీలో వెనుదిరిగి చూడలేదు.

ఫార్మాట్‌ ఏదైనా సరే... క్రీజులో కుదురుకుని... నింపాదిగా ఆడటాన్ని అలవాటుచేసుకోవడం.. బాధ్యతగా పరుగులు రాబట్టడం... జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. వ్యక్తిగతంగా ఆటలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోగలిగాడు... టీమిండియా మేటి ఆటగాళ్లలో లోకేశ్‌ రాహుల్‌... అత్యంత ప్రతిభావంతునిగా రాణిస్తున్నాడు.

టెస్టు క్రికెట్‌లో 36 మ్యాచులు ఆడిన లోకేశ్‌ రాహుల్‌... 2006 పరుగులు నమోదు చేశాడు. ఒక పరుగు తేడాతో డబల్‌ సెంచరీకి చేరువై 199 అత్యధిక పరుగుల స్కోరు నమోదు చేశాడు. ఐదు టెస్టు సెంచరీలతోపాటు 11 అర్థ సెంచరీలను తన పేరిట నమోదు చేశాడు. 237 బౌండరీలు, 14 సిక్సర్లున్నాయి.

వన్డే క్రికెట్‌ కెరీర్‌లో 32 వన్డే మ్యాచులు ఆడిన రాహుల్ 1239 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు.. ఏడు అర్థసెంచరీలున్నాయి. వన్డేల్లో 112 అత్యధిక పరుగుల రికార్డుంది. 98 బౌండరీలు... 25 సిక్సర్లున్నాయి.

టీ20 కెరీర్‌లో 41 మ్యాచులు ఆడిన రాహుల్ 1461 పరుగులు నమోదు చేశాడు. 110 పరుగుల అత్యధికస్కోరుతో రెండు సెంచరీలు... 11 అర్థ సెంచరీలున్నాయి. 129 బౌండరీలు... 61 సిక్సర్లతో ప్రత్యేక రికార్డును సొంతంచేసుకున్నాడు.

ఐపీఎల్‌ కెరీర్‌లో 67 మ్యాచులు ఆడిన రాహుల్‌... 1977 పరుగులతో ఓ సెంచరీ సొంతంచేసుకున్నాడు. 11 అర్థసెంచరీలతో 176 బౌండరీలు... 81 సిక్సర్లున్నాయి.

2013 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచుల్లో తన ఆటతీరు... బాధ్యతాయుత భాగస్వామ్యాన్ని అందిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లోకేశ్‌ రాహుల్‌ ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తాజా సీజన్‌ కు కెప్టన్‌ గా సారథ్యం వహిస్తున్నారు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు... సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లల్లో మంచి అనుభవం గడించిన రాహుల్‌ ఈ సీజన్‌లో తన వంతు బాధ్యతగా జట్టువిజయాల్లోకీలక పాత్ర పోషించడమేకాదు... ఐపీఎల్‌ ట్రోఫీని చేజిక్కించుకోవాలని రాహుల్‌ ఆశయం... లక్ష్యం.. నెరవేరాలని ఆశిద్ధాం..!

Tags :
|
|
|

Advertisement