Advertisement

  • జూన్ 30 వరకు లాక్ డౌన్ 5.0...అన్ని ప్రార్ధన మందిరాలకు జూన్ 8 నుంచి అనుమతి

జూన్ 30 వరకు లాక్ డౌన్ 5.0...అన్ని ప్రార్ధన మందిరాలకు జూన్ 8 నుంచి అనుమతి

By: Sankar Sat, 30 May 2020 7:37 PM

జూన్ 30 వరకు లాక్ డౌన్ 5.0...అన్ని ప్రార్ధన మందిరాలకు జూన్ 8 నుంచి అనుమతి

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగో విడత లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ 5.0కు కేంద్ర ప్రభుత్వ మొగ్గుచూపింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూన్‌ 8 నుంచి అన్ని రాష్ట్రాల్లో ప్రార్థనా మందిరాలు తెరుచుకోవచ్చని తెలిసింది.

lockdown,5.0,india,corona,modi,central governament ,జూన్ 30, లాక్ డౌన్ 5.0, ప్రార్ధన మందిరాలకు ,  జూన్ 8 ,కరోనా

ఇక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు హోటల్స్‌, రెస్టారెంట్లు, మాల్స్‌కు కూడా అనుమతినిచ్చింది. జూలై నుంచి పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు ప్రారంభం అవుతాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. లాక్‌డౌక్‌ కారణంగా రెండు నెలలుగా మూతబడ్డ అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైళ్లు. సినిమా హాల్స్‌, జిమ్‌లు, బార్లు, స్విమ్మింగ్ పూల్స్‌, ఆడిటోరియంల ప్రారంభంపై త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అలాగే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మతపరమైన కార్యకలాపాలపై కూడా త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఇప్పటికే దేశంలో కరోనా కారణంగా నాలుగు దశల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే తొలి రెండు దశల్లో లాక్ డౌన్ పటిష్టంగా అమలు అయింది ..ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా లాక్ డౌన్ అమలు చేసారు దీనితో కరోనా అంతగా ప్రభావం చూపలేదు ..తర్వాత మూడు , నాలుగవ దశల్లో కొంచెం , కొంచెం గా అనుమతులు ఇవ్వడంతో ప్రజలు సామజిక దూరం పాటిస్తూ తమ పనులను చేసుకుంటున్నారు ..ఇక అయిదవ దశలో మరిన్నీ అనుమతులు ఇచ్చారు..

Tags :
|
|
|
|

Advertisement