Advertisement

  • చైనా వస్తువుల నిషేధం డిమాండ్ తో గిరాకీ పెరిగిన దేశీయ రాఖీలు

చైనా వస్తువుల నిషేధం డిమాండ్ తో గిరాకీ పెరిగిన దేశీయ రాఖీలు

By: Sankar Sat, 01 Aug 2020 11:57 AM

చైనా వస్తువుల నిషేధం డిమాండ్ తో గిరాకీ పెరిగిన దేశీయ రాఖీలు



ఏటా రక్షాబంధన్‌ సందర్భంగా చైనా వేల కోట్ల వ్యాపారం చేస్తున్నది. రాఖీల ముడిసరుకు, దారాలు, పూసలు, చమ్మీలు, స్పాంజ్‌, ఇతరత్రా అలంకరణ సామగ్రిని తక్కువ ధరకు ఎగుమతి చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నది. ఏటా దేశవ్యాప్తంగా సుమారు 50 కోట్ల రాఖీలను విక్రయిస్తుండగా, సుమారు రూ.6 వేల కోట్ల వ్యాపారం కొనసాగుతున్నది.

అందులో చైనా వాటానే రూ.4 వేల కోట్లు కావడం గమనార్హం. గల్వాన్‌ ఘటన ఆ దేశానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. చైనా రాఖీలను బహిష్కరిస్తున్నట్టు సీఏఐటీ పేర్కొంది. వ్యాపారులకు సంబంధించి కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ అనేది దేశంలో అతిపెద్ద సంస్థ. ఇందులో సుమారు 40 వేల అసోసియేషన్లు భాగస్వాములుగా ఉండగా, సుమారు 7కోట్ల మంది వ్యాపారులు సభ్యులుగా ఉన్నారు.

సరిహద్దుల్లోని సైనికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకుగాను చైనా రాఖీలను, రాఖీలకు సంబంధించిన ఉత్పత్తులను ఈ సారి దిగుమతి చేసుకోవడం లేదని ప్రకటించింది. ఇప్పటికే చైనాకు ఇచ్చిన వెయ్యికోట్ల రాఖీల తయారీఆర్డర్‌ను రద్దు చేసినట్టు వెల్లడించింది. ఈ సారి పూర్తిగా భారతీయ రాఖీలతో పండుగను జరుపుకోవాలని సీఏఐటీ జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బహుమతులు, బొమ్మలు, మిఠాయి తదితర మొత్తం 3వేల రకాల చైనా ఉత్పత్తులను కూడా బహిష్కరించేందుకు ప్రణాళికను సీఏఐటీ సిద్ధం చేయడం గమనార్హం.

Tags :
|
|
|

Advertisement