Advertisement

  • ఖాతాదారుడికి తెలియకుండానే ఆరు బ్యాంకుల్లో అతడి పేరుతో లోన్

ఖాతాదారుడికి తెలియకుండానే ఆరు బ్యాంకుల్లో అతడి పేరుతో లోన్

By: chandrasekar Thu, 13 Aug 2020 12:56 PM

ఖాతాదారుడికి తెలియకుండానే ఆరు బ్యాంకుల్లో అతడి పేరుతో లోన్


ఆరు బ్యాంకుల్లో ఖాతాదారుడికి తెలియకుండానే అతడి పేరుతో ఉన్న ఖాతాల ద్వారా దుండగులు రూ.6 లక్షల రుణాలు తీసుకున్నారు. ఖాతాదారుడు సిబిల్‌ రిపోర్ట్‌ను పరిశీలించుకోగా ఈ విషయం బయటపడటంతో ఆందోళనకు గురైయ్యాడు.

బుధవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం యూసుఫ్‌గూడకు చెందిన సునీల్‌కుమార్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. సిబిల్‌ రిపోర్టు ఒకసారి చూసుకుందామని పరిశీలించాడు. సిబిల్‌ రిపోర్టు తక్కువగా చూపిస్తుండటంతో అనుమానం వచ్చి ఆరా తీశాడు.

మీరు పలు బ్యాంకుల్లో రుణాలు పొంది తిరిగి చెల్లించడం లేదంటూ తేలింది. నేను ఏ బ్యాంక్‌ నుంచి రుణం తీసుకోలేదు రుణాలు ఎవరు తీసుకున్నారంటూ సునీల్‌ ఆందోళనకు గురయ్యాడు. ఆరు బ్యాంకుల్లోని ఖాతాలను పరిశీలించాడు.

ఒక్కో బ్యాంకులో రూ. లక్ష చొప్పున సైబర్‌నేరగాళ్లు ఈ రుణం తీసుకున్నారు. బాధితుడి పాన్‌కార్డును ఉపయోగించి, ఆన్‌లైన్‌లో ఇన్‌స్టాంట్‌ లోన్‌ సౌకర్యం ద్వారా సైబర్‌నేరగాళ్లు బాధితుడి ఖాతాల నుంచి రుణాలు పొందినట్లు పోలీసులు గుర్తించారు.

Tags :
|
|

Advertisement