Advertisement

ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే రైళ్ల జాబితా

By: chandrasekar Thu, 04 June 2020 6:34 PM

ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే రైళ్ల జాబితా


భారతీయ రైల్వే జూన్ 1 నుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 200 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. అందులో 22 రైళ్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 70 రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. ఈ రైళ్లకు ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 11 రూట్లలో వెళ్లే ఆ 22 రైళ్ల వివరాలు తెలుసుకోండి.

* రైలు నెంబర్ 02728 గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రతీ రోజు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, రైలు నెంబర్ 02729 గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రతీ రోజు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుంది. ఈ రైలు హైదరాబాద్, సికింద్రాబాద్, కాజిపేట జంక్షన్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనకాపల్లి, విశాఖపట్నంలో ఆగుతుంది.

* రైలు నెంబర్ 07201 గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ప్రతీ రోజు గుంటూరు నుంచి సికింద్రాబాద్, రైలు నెంబర్ 07202 గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ప్రతీ రోజు సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తుంది. ఈ రైలు మంగళగిరి, విజయవాడ జంక్షన్, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, గార్ల, మహబూబాబాద్, కేసముద్రం, నెకొండ, వరంగల్, కాజీపేట్ జంక్షన్, ఘణపూర్, జనగాం, ఆలేరు, భువనరిగి, మౌలాలి, సికింద్రాబాద్‌లో ఆగుతుంది.

* రైలు నెంబర్ 01301 ముంబై నుంచి బెంగళూరు, రైలు నెంబర్ 01302 బెంగళూరు నుంచి ముంబై ప్రతిరోజూ వెళ్తుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో మంత్రాలయం రోడ్, గుంతకల్ జంక్షన్, అనంతపూర్ స్టేషన్లలో ఆగుతుంది.

* రైలు నెంబర్ 02793 రాయలసీమ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నుంచి నిజామాబాద్, రైలు నెంబర్ 02794 నిజామాబాద్ నుంచి తిరుపతి ప్రతిరోజూ వెళ్తుంది. ఈ రైలు కడప, గుంతకల్ జంక్షన్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, సైదాపూర్, యాద్గిర్, నాల్వర్, హళకట్ట, చిత్తాపూర్, మల్‌ఖైద్ రోడ్, సేరం, కుర్గుంట, నవాంగ్డి, తాండూర్, వికారాబాద్ జంక్షన్, శంకరపల్లి, లింగంపల్లి, సనత్‌నగర్, బేగంపేట్, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్‌లో ఆగుతుంది.

list,of trains,from,andhra,pradesh ,ఆంధ్రప్రదేశ్, నుంచి, వెళ్లే, రైళ్ల, జాబితా


* రైలు నెంబర్ 01019 ముంబై నుంచి భువనేశ్వర్, రైలు నెంబర్ 01020 భువనేశ్వర్ నుంచి ముంబై ప్రతిరోజూ వెళ్తుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో తాండూర్, లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్ జంక్షన్, కాజిపేట్ జంక్షన్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్‌ స్టేషన్లలో ఆగుతుంది.

* రైలు నెంబర్ 02805 ఏపీ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ, రైలు నెంబర్ 02806 న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం ప్రతిరోజూ వెళ్తుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఆగుతుంది.

* రైలు నెంబర్ 01301 దనాపూర్ నుంచి బెంగళూరు, రైలు నెంబర్ 01302 బెంగళూరు నుంచి దనాపూర్ ప్రతిరోజూ వెళ్తుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో రామగుండం, వరంగల్, విజయవాడ జంక్షన్, ఒంగోలు, నెల్లూరు, కుప్పం స్టేషన్లలో ఆగుతుంది.

* రైలు నెంబర్ 02703 హౌరా నుంచి సికింద్రాబాద్, రైలు నెంబర్ 02704 సికింద్రాబాద్ నుంచి హౌరా ప్రతిరోజూ వెళ్తుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, మిర్యాలగూడ, నల్గొండ, రామన్నపేట, సికింద్రాబాద్ జంక్షన్‌లో ఆగుతుంది.

* రైలు నెంబర్ 02245 హౌరా నుంచి యశ్వంత్‌పూర్, రైలు నెంబర్ 02246 యశ్వంత్‌పూర్ నుంచి హౌరా మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం వెళ్తుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, రేణిగుంట జంక్షన్లలో ఆగుతుంది.

* రైలు నెంబర్ 02434 న్యూ ఢిల్లీ నుంచి చెన్నై, రైలు నెంబర్ 02691 చెన్నై నుంచి న్యూ ఢిల్లీ సోమవారం, గురువారం వెళ్తుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో వరంగల్, విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది.

* రైలు నెంబర్ 02692 న్యూ ఢిల్లీ నుంచి బెంగళూరు, రైలు నెంబర్ 02691 బెంగళూరు నుంచి న్యూ ఢిల్లీ ప్రతిరోజూ వెళ్తుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, గుంతకల్లు, అనంతపూర్‌లో ఆగుతుంది.

Tags :
|
|
|

Advertisement