Advertisement

ప్రత్యేక విమానం బుక్ చేసిన లిక్కర్ వ్యాపారి

By: chandrasekar Sat, 30 May 2020 5:16 PM

ప్రత్యేక విమానం బుక్ చేసిన లిక్కర్ వ్యాపారి


తన కుటుంబానికి చెందిన నలుగురిని భోపాల్ నుంచి ఢిల్లీ పంపించడం కోసం ఓ లిక్కర్ వ్యాపారి ఏకంగా 180 సీట్ల విమానాన్ని బుక్ చేశాడు. ఆ విమానం ఢిల్లీ నుంచి భోపాల్‌కు ఖాళీగా వచ్చి, నలుగురిని ఎక్కించుకుని మళ్లీ ఢిల్లీకి వెళ్లింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ లిక్కర్ వ్యాపారి ఇలా ప్రత్యేకంగా ఫ్లైట్ బుక్ చేసినట్టు తెలిసింది. ప్రైవేటుగా నడిపే ఏ320 విమానాన్ని ఆయన బుక్ చేసుకున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆ లిక్కర్ వ్యాపారి కుమార్తె, ఆమె ఇద్దరు పిల్లలు, వారి పనిమనిషి ఢిల్లీకి వెళ్లలేక రెండు నెలలుగా భోపాల్‌లోనే ఉండిపోయారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా దేశీయ విమానయాన సర్వీసులకు అనుమతి ఇచ్చింది. గత సోమవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో తమ కుటుంబసభ్యులను పంపించడానికి ఆయన ప్రత్యేక ఫ్లైట్ బుక్ చేశాడు. మే 25వ తేదీన ఆ విమానం భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లింది. విమానయాన నిపుణుల ప్రకారం 180 సీట్ల ఏ320 విమానాన్ని బుక్ చేసుకోవాలంటే రూ.20 లక్షల ఖర్చు అవుతుంది. కుటుంబం కోసం ఎంత ఖర్చు పెట్టిన దానిలో కలిగే ఆనందమే వేరు.

Tags :
|
|
|

Advertisement