Advertisement

గుడ్ న్యూస్ ..పెరిగిన దేశ ప్రజల ఆయుర్దాయం

By: Sankar Fri, 16 Oct 2020 8:51 PM

గుడ్ న్యూస్ ..పెరిగిన దేశ ప్రజల ఆయుర్దాయం


దేశంలో లక్షలాది మంది కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేని వ్యక్తులు కరోనా నుంచి తొందరగా కోలుకుంటుండగా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు త్వరగా కోలుకోలేకపోతున్నారు. అయితే, ప్రపంచంలోని మనుషుల ఆయుష్షుపై 200 దేశాల్లో పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గత ముప్పై ఏళ్ల కాలంలో ఇండియాలో మనుషుల ఆయుష్షు గణనీయంగా పెరిగింది. 1990 వ సంవత్సరంలో భారతీయుడి సగటు ఆయుర్దాయం 59.6 ఏళ్ళు ఉండగా, 2019 నాటికి అది 70.8 ఏళ్లకు పెరిగింది. అంటే దాదాపుగా పదేళ్ల ఆయుర్దాయం పెరిగింది. వ్యక్తుల మరణాలకు సంబంధించిన 286 రకాల కారణాలు, 369 రకాల వ్యాధులను విశ్లేషిస్తూ ఈ పరిశోధన సాగింది.

భారతీయుల సగటు ఆయుర్దాయం గణనీయంగా పెరిగినప్పటికీ, ఆరోగ్యవంతమైన జీవితం గడపలేకపోతున్నాడని పరిశోధనలు చెప్తున్నాయి. అనేక రకాలైన దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని పరిశోధకులు చెప్తున్నారు. అయితే, ఒక్కోరాష్ట్రంలో మనిషి యొక్క ఆయుర్దాయం ఒక్కో విధంగా ఉందని, యూపీలో సగటు ఆయుర్దాయం 66.9 ఏళ్ళు ఉండగా, కేరళలో 77.3 ఏళ్ళు ఉన్నట్టు పరిశోధనలో తేలింది.

Tags :
|
|

Advertisement