Advertisement

  • LG వింగ్ డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్

LG వింగ్ డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్

By: chandrasekar Sat, 31 Oct 2020 1:17 PM

LG వింగ్ డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్


భారత్ లో LG సంస్థ డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. LG వింగ్ అని పిలిచే ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన స్వీవెల్ మోడ్ తో పాటు ప్రధాన డిస్ ప్లేను క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 90 డిగ్రీల వరకు తిప్పుకోవచ్చు. ఇలా తిప్పినప్పుడు టీ ఆకారంలో మొబైల్ కనిపిస్తుంది. భారత వినియోగదారులు ఈ ఫోన్ ను నవంబరు 9 నుంచి కొనుగోలు చేసే వీలును సంస్థ కల్పించింది. రెండు కలర్స్ లో ఇది అందుబాటులో వుంటుంది. ఎల్జీ వింగ్ స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 765జీ ఎస్ఓసీ, 5జీ, ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి ఆప్షన్లతో ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త డ్యూయల్ స్క్రీన్ ఎల్జీ వింగ్ 128 జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.69,990గా సంస్థ నిర్దేశించింది. నవంబరు 9 నుంచి అందుబాటులోకి రానున్న అరోరా గ్రే, ఇల్యూజన్ స్కై కలర్స్ లో దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కు సంబంధించ సేల్స్ డీల్స్, ఇతర ఆఫర్లు కంపెనీ ఇంకా వెబ్ సైట్ లో పంచుకోలేదు. LG వింగ్ మొదటిసారి దక్షిణ కొరియాలో రెండు స్టోరేజి ఎంపికలతో ప్రారంభమైంది. ఈ ఫోన్ కు సంంబంధించి 256 జీబీ వేరియంట్ భారత్‌కు వస్తుందా అనేదానిపై స్పష్టత లేదు.

LG వింగ్ ఫీచర్స్...

LG వింగ్ స్పోర్ట్స్ 6.8 అంగుళాల హెచ్ డీ ప్లస్(1080X2460 పిక్సెల్స్) పీ-ఓఎల్ఈడీ ఫుల్ విజన్ ప్రైమరీ డిస్ ప్లే, రెండోది 3.9 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్(1080X1240 పిక్సెల్స్) ప్యానెల్ తో 1.15:1 యాస్పెక్ట్ రేషియోలో అందుబాటులోకి రానుంది.

ఇది ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 765జీ ఎస్ఓసీ తో పాటు 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజిని కలిగి ఉంది. అంతే కాకుండా ఇది డ్యూయల్ సిమ్ కార్డు(నానో)తో ఆండ్రాయిడ్ 10 క్యూఓఎ ఆప్షన్ తో అందుబాటులోకి రానుంది.

ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా దీనిలో 64 మెగాపిక్సెల్ కెమెరా OIS మద్దతుతో, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా 117-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూతో అందుబాటులోకి రానుంది.

12 మెగాపిక్సెల్ కెమెరాతో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌ కూడా ఇందులో ఉంటుంది. ముందు ప్యానెల్‌లో ఎఫ్ / 1.9 ఎపర్చర్‌తో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అది పాప్-అప్ మాడ్యూల్ లోపల అమరి ఉంది.

కెమెరాలో గింబాల్ మోషన్ కెమెరా, డ్యూయల్ రికార్డింగ్, హెక్సా మోషన్ స్టెబిలైజర్ తో పాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

"గింబాల్ మోషన్ కెమెరా LG వింగ్ రెండవ స్క్రీన్‌ను అనుకూలమైనట్లుగా మారుస్తుంది. ఇది స్పష్టమైన షాట్‌లతో పాటు మృదువైన వీడియో ఫుటేజ్‌ను ఒక చేతితో హారిజంటల్ మోడ్‌లో బంధించడానికి అవసరమైన స్థిరత్వాన్ని అందిస్తుంది" అని కంపెనీ వివరించింది.

LG స్మార్ట్‌ఫోన్ ఐపీ54 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ తో అందుబాటులోకి రానుంది. 5జీ, 4000 mAh బ్యాటరీ సామర్థ్యంతో 25W ఫాస్ట్ ఛార్జింగ్స 10W వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఆప్షన్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి. ఫోన్ బరువు 260 గ్రాములు, మందం 10.9 మీమీ ఉంది.

Tags :
|
|

Advertisement