Advertisement

  • డ్యూయల్ డిస్ ప్లే తో...ఎల్జీ వెల్వెట్ మనదేశంలో లాంచ్

డ్యూయల్ డిస్ ప్లే తో...ఎల్జీ వెల్వెట్ మనదేశంలో లాంచ్

By: chandrasekar Wed, 28 Oct 2020 9:56 PM

డ్యూయల్ డిస్ ప్లే తో...ఎల్జీ వెల్వెట్ మనదేశంలో లాంచ్


ఎల్జీ వింగ్‌తో పాటు ఎల్జీ వెల్వెట్ స్మార్ట్ ఫోన్ కూడా భారత్ లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ వెర్షన్ క్వాల్ కాంస్నాప్ డ్రాగన్ 765జీతో పనిచేస్తూ ఉండగా, మనదేశ వెర్షన్ మాత్రం క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 845తో పనిచేయనుంది. ఇందులో వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఎల్జీ జీ8ఎక్స్ తరహాలో డ్యూయల్ డిస్ ప్లే కూడా దీనిలో అందుబాటులో ఉంది. కానీ దానికి మీరు అదనపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

ఎల్జీ వెల్వెట్ ధర మరియు స్పెసిఫికేషన్లు

ఎల్జీ వెల్వెట్ ధరను మనదేశంలో రూ.36,990గా నిర్ణయించారు. డ్యూయల్ స్క్రీన్ కూడా కావాలంటే మొత్తంగా రూ.49,990 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఫోన్ సేల్ అక్టోబర్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అరోరా సిల్వర్, న్యూ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన సేల్ అక్టోబర్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సినిమా ఫుల్ విజన్ పీవోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు.

డ్యూయల్ డిస్ ప్లే ఎంచుకునే వారికి ఎల్జీ జీ8ఎక్స్ తరహాలో మరో డిస్ ప్లేను అందించనున్నారు. వీటి యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉండనుంది.

క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ గా ఉంది. దీంతో పాటు 8 మెగా పిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి.

దీంతోపాటు ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. వీటిలో స్టీడీ కామ్, ఏఎస్ఎంఆర్ రికార్డింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇందులో 4300 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను దీనిలో అందించారు. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 180 గ్రాములు.

Tags :
|
|

Advertisement