Advertisement

ఎల్జీ కే42 మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లాంచ్

By: chandrasekar Tue, 22 Sept 2020 7:10 PM

ఎల్జీ కే42 మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లాంచ్


ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఎల్జీ కే42 మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. మొదటగా దీన్ని సెంట్రల్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల్లో లాంచ్ చేశారు. దీనిలో వెనకవైపు నాలుగు కెమెరాలు, గూగుల్ అసిస్టెంట్‌కు ప్రత్యేక బటన్ అందించారు. రెండు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌ను దీనిలో అందించారు. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. ఈ ఫోన్ ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే విధంగా రూపొందించారు. ఈ ఫోన్ ధర గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. కోస్టారికా, డొమినిక్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, గుటెమాలా, హొండురాస్, నికారాగ్వా, పనామాల్లో త్వరలో ఇది సేల్‌కు వెళ్లనుంది. గ్రీన్, గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఎల్జీ కే42 స్పెసిఫికేషన్లు

దీనిలో 6.6 అంగుళాల హెచ్ డీ+ పంచ్ హోల్ డిస్ ప్లేను ఎల్జీ అందించింది. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను పెంచుకునే అవకాశం ఉంది.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కెమెరా, దీంతోపాటు 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి.

ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది.

ఈ ఫోన్ MIL-STD-810G సర్టిఫికేషన్ పొందింది. అంటే ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే విధంగా దీన్ని రూపొందించారు.

దీని బ్యాక్ ప్యానెల్‌పై తరంగాల డిజైన్ ఉంది. అంతేకాకుండా గీతలు పడకుండా యూవీ కోటింగ్ కూడా వేశారు.

సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎల్జీ యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఎల్జీ కే42 పనిచేయనుంది.

Tags :
|
|

Advertisement