Advertisement

  • ఫార్ములా వన్ రేసింగ్ లో రికార్డు సృష్టించిన హామిల్టన్...

ఫార్ములా వన్ రేసింగ్ లో రికార్డు సృష్టించిన హామిల్టన్...

By: Sankar Mon, 16 Nov 2020 06:45 AM

ఫార్ములా వన్ రేసింగ్ లో రికార్డు సృష్టించిన హామిల్టన్...


ఫార్ములావన్‌ (ఎఫ్‌1) క్రీడలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్న బ్రిటన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ తన కెరీర్‌లో మరో మైలురాయి అందుకున్నాడు.

ఎఫ్‌1 దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ పేరిట ఉన్న మరో రికార్డును ఈ మెర్సిడెస్‌ డ్రైవర్‌ సమం చేశాడు. ఆదివారం జరిగిన టర్కీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. నిర్ణీత 58 ల్యాప్‌ల ఈ రేసును ఆరో స్థానం నుంచి ప్రారంభించిన హామిల్టన్‌ అందరికంటే వేగంగా గంటా 42 నిమిషాల 19.313 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు.

ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది పదో విజయంకాగా... కెరీర్‌లో 94వ విజయం. తాజా గెలుపుతో ఈ సీజన్‌లో మరో మూడు రేసులు మిగిలి ఉండగానే 35 ఏళ్ల హామిల్టన్‌ డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌నూ సొంతం చేసుకున్నాడు. హామిల్టన్‌ కెరీర్‌లో ఇది ఏడో ప్రపంచ టైటిల్‌. తద్వారా ఏడు ప్రపంచ టైటిల్స్‌తో మైకేల్‌ షుమాకర్‌ (జర్మనీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును హామిల్టన్‌ సమం చేశాడు.

Tags :
|

Advertisement