Advertisement

బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు లేఖలు

By: chandrasekar Tue, 14 July 2020 11:52 AM

బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు లేఖలు


అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి రాజస్థాన్‌లో రాజకీయాలు. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుతిరిగిన సంగతి తెలిసిందే. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని, గెహ్లాట్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని ఆయన ఆరోపించారు. దీంతో ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జరిగే బలపరీక్షకు దూరంగా ఉండాలని భారతీయ ట్రైబల్ పార్టీ తమ ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలిపింది. ఈ మేరకు సోమవారం వారికి లేఖలు రాసింది. అయితే ఈ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు సోమవారం ఉదయం తెలిపారు. కాగా, 109 మంది ఎమ్మెల్యేలు తమ వెంట ఉన్నారని, తమ ప్రభుత్వం స్థిరంగా ఉన్నదని సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు.

అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 101 కాగా, తమ ప్రభుత్వానికి అంతకంటే ఎక్కువే మెజార్టీ ఉన్నదని, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకే ఉన్నదని ఆయన అన్నారు. మరోవైపు బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం గెహ్లాట్‌కు మద్దతు తెలుపగా ఆ పార్టీ మాత్రం బలపరీక్షకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు లేఖలు రాసింది.

Tags :
|
|
|

Advertisement