Advertisement

మెమొరీ ని మెరుగుపర్చుకుందాం..

By: chandrasekar Mon, 17 Aug 2020 11:21 PM

మెమొరీ ని  మెరుగుపర్చుకుందాం..


వయసు పైబడే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంటుందని అంటారు. అయితే, వయసు తారతమ్యం లేకుండానే ఎవరికైనా జ్ఞాపకశక్తి తగ్గిపోవొచ్చని న్యూయార్క్ లోని 'స్టోనీ బ్రూక్ ఆఫ్ మెడిసిన్ యూనివర్శిటీ' వారు చేసిన సర్వేలో తేలింది. ప్రతి ఒక్కరిలో న్యూరోలాజికల్ కండీషన్స్, తలకి దెబ్బతగిలినా, జెనిటిక్స్ సంబంధించిన కారణాలు తప్ప మరేవిధంగానూ మెదడుకు ప్రమాదకరమైన అంశాలుండవని వైద్యులు చెబుతున్నారు. అయితే, వీటికంటే కూడా, ప్రస్తుత జీవన విధానంలో మనిషిని చిన్నాభిన్నం చేస్తున్న అనేక అంశాలే జ్ఞాపకశక్తి తగ్గి మెదడు మొద్దుబారిపోతుందని తెలిపారు.

కండరాలు గట్టిపడాలంటే, శరీరానికి ఏవిధంగా వ్యాయామం అవసరమో.. అదే విధంగా మెదడు చురుగ్గా అయ్యేందుకు ప్రత్యేక ట్రైనింగ్ అవసరం. అందుకోసం 4,715 మందికి పదిహేను నిమిషాలపాటు ఆన్ లైన్ బ్రెయిన్ ట్రైనింగ్ పొగ్రామ్ వారానికి ఐదురోజులపాటు ఇవ్వగా దాదాపుగా అందరికీ మెమరీ మెరుగైంది. ప్రతిరోజు ఛాలెంజింగ్ బోర్డు గేమ్స్, వర్డ్ పజిల్స్, గళ్లను నింపడం, క్లిషమైన పజిల్స్ ని సాల్వ్ చేయడం వల్ల మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.మనం ప్రతినిత్యం తినే పంచదార కారణంగా ఎన్నో సమస్యలతోపాటుగా మనలోని అభిజ్ఞ క్షీణిస్తుంది.

అది తెలుసుకునేందుకు నాలుగు వేల మందికి పంచదార కలిపిన డ్రింక్, జ్యూస్, సోడా ఇచ్చారు. కొద్ది సమయంలోనే వారి మెదడు స్తబ్దతగా మారినట్లు గమనించారు. అంతేకాదు, ఆ సమయంలో వారు నిద్రకు ఉపక్రమించేలా అనిపించిందని ఎక్కువమంది తెలిపారు. అందుకని పంచదారకు బదులుగా బెల్లం, తేనె మేలు చేస్తాయి.మెదడును శక్తివంతంగా, చురుగ్గా పనిచేసే తీరును తెలుసుకునేందుకు 28 రకాల స్టడీస్ చేశారు. ఇపిఎ, డిహెచ్ఎ అధికంగా ఉండే చేప, చేప నూనెతో చేసిన ఆహార పదార్ధాల్ని ఇరవై రోజులపాటు ఇవ్వగా 90 శాతం మందికి 60 ఏళ్లు పైబడిన వారిలోనూ మెదడు చురుగ్గానూ, జ్ఞాపకశక్తి మెరుగ్గాను అయింది.

ప్రస్తుత కాలంలో స్థూలకాయం వల్ల అనేక సమస్యలు. 18-35 మధ్యలో అధిక బరువు ఉన్న 50 మందిని పరిశీలించగా బాడీ మాస్ ఇండెక్స్ కారణంగా పూర్ మెమెరీని కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఉండాల్సిన బరువు కంటే అధిక బరువు ఉండటం వల్ల, శరీరంలోని ఉండే ఇన్సులిన్ లెవెల్ ని సమానంగా ఉంచే క్రమంలో మెదడుమీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ సమస్యను అధిగమించకపోతే, వృద్ధాప్యంలో అల్జీమర్స్ బారిన పడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Tags :
|

Advertisement