Advertisement

  • ఆ భాష ప్రాధాన్యత తెలియనివారు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు..ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఆ భాష ప్రాధాన్యత తెలియనివారు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు..ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

By: Sankar Mon, 14 Sept 2020 3:30 PM

ఆ  భాష ప్రాధాన్యత తెలియనివారు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు..ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు


హిందీ భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని.. అలాగని ఏ భాషనూ ఎవరిపైనా రుద్దాల్సిన అవసరం లేదని, ఏ భాషనైనా వ్యతిరేకించడం సరికాదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘వివిధ భాషలు, వివిధ ఆచారాలున్నా భారతదేశమంతా ఒక్కటే అని, భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ విశిష్టత’ ఈ సాంస్కృతిక గొప్పదనాన్ని కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

హిందీ దివస్ సందర్భంగా మధుబన్ విద్యాసంబంధ ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్ లైన్ సమావేశంలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ.. ఎవరి మాతృభాషను వారు నేర్చుకుంటూనే మరో భారతీయ భాషను కూడా నేర్చుకోవాలని సూచించారు. ఎన్ని ఎక్కువ భాషలొస్తే అంత ప్రగతి సాధించేందుకు వీలవుతుందన్నారు. ఇతర భాషలోని పదాలను, సామెతలను నేర్చుకుంటుంటే.. ఆ భాష మాట్లాడే వారితో ప్రేమానురాగాలు పెంచుకోవడంతోపాటు సత్సంబంధాలు ఏర్పడతాయని, దేశ సమైక్యత సుదృఢం అవుతుంది’ అని చెప్పారు.

తన విద్యార్థి దశలో హిందీ వ్యతిరేక ఉద్యమాలను చూశానన్న ఉపరాష్ట్రపతి.. ఢిల్లీకి వచ్చిన తర్వాత జాతీయస్థాయిలో ప్రతి ఒక్కరూ ఈ భాషను నేర్చుకోవలసిన ఆవశ్యకతను స్వయంగా గ్రహించానని తెలిపారు. దక్షిణ భారతదేశంలో హిందీ భాష పట్ల గౌరవభావాలున్నాయని.. ప్రాధాన్యత తెలియని కొద్దిమంది మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు

Tags :
|
|

Advertisement