Advertisement

మళ్లీ కెమెరాల్లో చిక్కిన చిరుత..

By: chandrasekar Thu, 04 June 2020 6:51 PM

మళ్లీ కెమెరాల్లో చిక్కిన చిరుత..


హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో సోమవారం రాత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలో చిరుత సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దాంతో అప్రమత్తమైన అధికారులు చిరుతను పట్టుకునేదుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. చిరుత అడుగు జాడలను అనుసరిస్తూ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాజేంద్రనగర్‌ ప్రాంతంలో 20 ట్రాప్ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. వాటి ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తూ చిరుతల కదలికలను విశ్లేషిస్తున్నారు.

మే 14న నగర శివారులోని కాటేదాన్ ప్రాంతంలో చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై డివైడర్ వద్ద పడుకొని స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాదు ఓ లారీ డ్రైవర్‌పై దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుంది. సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో అప్పటి నుంచి దాన్ని పట్టుకునేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మే 28న రాత్రి కూడా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సీసీ కెమెరాల్లో చిరుత కనిపించింది. అక్కడి నుంచి చిరుత గగన్‌పహాడ్‌ గుట్టల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా ఆనవాళ్లు లభించాయి. ప్రస్తుతం అదే అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలోనే దృశ్యాలు రికార్డు కావడంతో ఆ చుట్టుపక్కలే చిరుత ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement