Advertisement

  • బ్రేకింగ్: లారీ డ్రైవర్‌పై దాడి చేసిన చిరుత చిక్కింది...!

బ్రేకింగ్: లారీ డ్రైవర్‌పై దాడి చేసిన చిరుత చిక్కింది...!

By: Anji Sun, 11 Oct 2020 08:51 AM

బ్రేకింగ్: లారీ డ్రైవర్‌పై దాడి చేసిన చిరుత చిక్కింది...!

హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్‌లో 5 నెలలుగా అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతు చిక్కకుండా తిరుగుతోన్న చిరుత ఎట్టకేలకు దొరికిపోయింది.. ఈ చిరుత.. మే నెలలో రంగారెడ్డి జిల్లా మైలార్ దేవపల్లి పోలీస్టేషన్ పరిధిలోని కాటేదాన్ రైల్వే ట్రాక్ వద్ద చిరుత మెయిన్ రోడ్ పై పడుకుని కనిపించింది చిరుత... రోజు నడిరోడ్డుపై హల్ చల్ చేసింది.

ఆ తర్వాత.. లారీ డ్రైవర్‌పై దాడికి పాల్పడింది.. అప్పటి నుంచి దానికోసం వేట కొనసాగుతూనే ఉంది.. అప్పడప్పుడు బయటకు రావడం పశువులపై దాడి చేయడం.. మళ్లీ అటవీప్రాంతంలోకి వెళ్తూ వచ్చింది.. వాలంతరీలో నెల రోజుల క్రితం పశువుల కొట్టంపై దాడి చేసింది చిరుత.

దీంతో వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేసిన అధికారులు.. వ్యవసాయ క్షేత్రంలో నెల రోజుల తరువాత మరోసారి శుక్రవారం అర్ధరాత్రి లేగదూడను చంపేసింది.. ఇక, మరోసారి అదే వ్యవసాయ క్షేత్రంలోకి ఇవాళ రాత్రి సమయంలో రాగా.. అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన బోనులో చిక్కుకుపోయింది. చిరుతను జూపార్క్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.

Tags :

Advertisement