Advertisement

  • కరోనా బారిన పడిన దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ..!

కరోనా బారిన పడిన దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ..!

By: Sankar Tue, 25 Aug 2020 08:45 AM

కరోనా బారిన పడిన దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ..!


దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ కరోనా బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి..అతడి 34 వ బర్త్ డే సందర్భంగా అతడి ఫ్రెండ్స్ ఇచ్చిన సర్ప్రైజ్ పార్టీ బోల్ట్ ను చిక్కులో పడేసినట్లు తెలుస్తుంది.. ఈ నెల 21న మాంచెస్టర్‌లో 34వ పుట్టిన రోజు వేడుకులు జరుపుకున్న ఉసేన్ బోల్ట్.. ఎలాంటి కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకోకుండా అతిథులతో కలిసి పార్టీ చేసుకున్నాడు.

ఆ పార్టీకి వచ్చిన వారు సామాజిక దూరం నిబంధనని పాటించకపోగా.. కనీసం మాస్కులు కూడా ధరించలేదని తేలింది. దాంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తర్వాత రోజు నుంచే హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన ఉసేన్ బోల్ట్.. గత శనివారం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలినట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఉసేన్ బోల్ట్ తన 34వ పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకోవాలని అనుకోలేదట. కానీ.. అతని ఫ్రెండ్స్ సర్‌ప్రైజ్‌గా ఆ పార్టీని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి మాంచెస్టర్ ఫుట్‌బాల్ టీమ్ స్టార్ ఆటగాళ్లు కూడా హాజరయ్యారు..

Tags :
|

Advertisement