Advertisement

  • షాకింగ్ న్యూస్ ..దిగ్గజ క్రికెటర్ కు హార్ట్ ఎటాక్

షాకింగ్ న్యూస్ ..దిగ్గజ క్రికెటర్ కు హార్ట్ ఎటాక్

By: Sankar Fri, 23 Oct 2020 4:51 PM

షాకింగ్ న్యూస్ ..దిగ్గజ క్రికెటర్ కు హార్ట్ ఎటాక్


భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు గుండె ఆపరేషన్‌ చేశారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు ప్రకటించారు.

తాజా వార్తల నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కపిల్‌ త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేస్తున్నారు. హర్యానా హరికేన్‌గా పేరొందిన కపిల్‌ సారథ్యంలోనే భారత జట్టు 1983లో వన్డే ప్రపంచ కప్‌ను తొలిసారి కైవసం చేసుకుంది.

ఇండియన్ క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్ల లిస్ట్ లో కపిల్ దేవ్ ముందు వరుసలో ఉంటాడు...నికార్సయిన అల్ రౌండర్ గా బ్యాట్ మరియు బంతితో చెలరేగిన కపిల్ దేవ్ టీం ఇండియా కు ఎన్ని మరుపురాని విజయాలను అందించాడు ...కపిల్ దేవ్ రిటైర్ అయి చాల ఏళ్ళు అవుతున్న మల్లి టీం ఇండియాలో ఇంతవరకు అతడి స్థాయిలో రాణించే ఆల్ రౌండర్ మల్లి కనపడలేదు ..ఇది ఒకటి చాలు కపిల్ దేవ్ అంటే ఏంటి అనేది చెప్పడానికి ..

Tags :
|

Advertisement