Advertisement

  • అతడొక పోరాడ యోధుడు ..కింగ్స్ ఎలెవన్ విజయాల వెనక ఎవరు ఉన్నారో చెప్పిన గవాస్కర్

అతడొక పోరాడ యోధుడు ..కింగ్స్ ఎలెవన్ విజయాల వెనక ఎవరు ఉన్నారో చెప్పిన గవాస్కర్

By: Sankar Mon, 26 Oct 2020 4:52 PM

అతడొక పోరాడ యోధుడు ..కింగ్స్ ఎలెవన్ విజయాల వెనక ఎవరు ఉన్నారో చెప్పిన గవాస్కర్


ఐపీయల్ పదమూడవ సీజన్ ప్రారంభంలో వరుస ఓటములతో రేస్ లో చివరి స్థానంలో నిలిచిన కింగ్స్ ఎలెవన్ పూజాబ్ జట్టు ఒక్కసారిగా పుంజుకుంది ..వరుసగా నాలుగు విజయాలతో ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది..దీనితో ఆ జట్టు మీద ఇప్పుడు అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు ..తాజాగా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా కింగ్స్ ఎలెవన్ ప్రదర్శనకు మెచ్చుకున్నాడు..

గెలిచే దారిని వారు కనుగొన్నారు. టోర్నీ ఆరంభంలో వారు విజయాలను సాధించలేకపోయారు. ప్రతిసారి విజయానికి చేరువగా వచ్చి ఓడారు. తొలి మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో ఓడారు. తర్వాత చివరి ఓవర్లలో పరాజయం పాలయ్యారు’ అని గావస్కర్ తెలిపారు.గత కొన్ని మ్యాచ్‌ల్లో వారు అద్భుతంగా ఆడారు.

శనివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులే చేసిన పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించడం సంచలనం. పంజాబ్ ఆటగాళ్లు తమను తాము బలంగా నమ్మారు. జట్టును రాహుల్ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. కెప్టెన్‌గా రాహుల్ ఎదిగాడు. ఫీల్డింగ్ సెట్ చేయడంలో, బౌలింగ్ మార్పు విషయంలో.. రాహుల్ రాటుదేలాడు’ అని గావస్కర్ ప్రశంసలు గుప్పించాడు.

పంజాబ్ విజయాల్లో అనిల్ కుంబ్లే పాత్రను మరవొద్దు. క్రికెట్ కెరీర్ మొత్తం అతడు పోరాడాడు. దవడకు దెబ్బతగిలినా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగాడు. అదే ధీరత్వం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో కనిపిస్తోంద’ని గావస్కర్ కొనియాడాడు. వీరిద్దరి వల్లే అసాద్యమనుకున్న పరిస్థితుల్లో పంజాబ్ పుంజుకుందని.. ప్లేఆఫ్స్ రేసులోనూ నిలిచిందని రాహుల్, కుంబ్లేను గావస్కర్ ప్రశంసించాడు.

Tags :
|
|
|

Advertisement