Advertisement

  • 2023 వరల్డ్ కప్ వరకు ఆడుతానన్న ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్ మాన్

2023 వరల్డ్ కప్ వరకు ఆడుతానన్న ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్ మాన్

By: chandrasekar Sat, 22 Aug 2020 9:00 PM

2023 వరల్డ్ కప్ వరకు ఆడుతానన్న ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్ మాన్


2023 వరల్డ్ కప్ వరకు తాను క్రికెట్ ఆడుతానన్న ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్ మాన్ ఆరోన్ ఫించ్. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్ మాన్ వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన రిటైర్మెంట్‌పై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. భారత్‌లో జరిగే 2023 వన్డే ప్రపంచకప్ తన కెరీర్‌లో చివరి మజిలీ అని చెప్పుకొచ్చాడు.

తన మనసులో వున్న అభిప్రాయాన్ని వివరిస్తూ అప్పటివరకు తాను క్రికెట్ ఆడతానని కొన్నేళ్లుగా ఇదే అనుకుంటున్నానని వెల్లడించాడు. ప్రస్తుతం తనకు 36 ఏళ్లు వచ్చాయన్న ఫించ్, తాను ఫామ్ కోల్పోకుండా, గాయాలు కాకుండా ఉండడంపైనే కెరీర్ ఆధారపడి ఉంటుందని వివరించాడు.

ఆస్ట్రేలియా క్రికెటర్లు వచ్చే నెలలో యూఏఈ వేదిక సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో రెండు వారాలు ఆలస్యంగా పాల్గొననున్నారు. సెప్టెంబర్ 3 నుంచి ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఉండటంతో ఈ జాప్యం జరగనుందని తెలిపారు. డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమ్మిన్స్, గ్లెన్ మాక్స్ వెల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఈ లీగ్‌లో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐపీల్ పై వివిధ దేశాల క్రికెటర్లు చాల ఆసక్తిని కనబరుస్తున్న విషయం అందరికి తెలిసిందే.

Tags :

Advertisement