Advertisement

  • ఉల్లిపాయలతో వ్యాధి వచ్చేందుకు దారి తీస్తున్నాయి : CDC హెచ్చరిక

ఉల్లిపాయలతో వ్యాధి వచ్చేందుకు దారి తీస్తున్నాయి : CDC హెచ్చరిక

By: chandrasekar Wed, 05 Aug 2020 8:53 PM

ఉల్లిపాయలతో వ్యాధి వచ్చేందుకు దారి తీస్తున్నాయి : CDC హెచ్చరిక


ఉల్లిపాయలు ఓ భయంకర వ్యాధి వచ్చేందుకు దారి తీస్తున్నాయి అని అమెరికాలో అంటువ్యాధుల నియంత్రణ సంస్థ - CDC స్వయంగా చెప్పింది. ఈమధ్య అమెరికా, కెనడాలో సాల్మొనెల్లా మహమ్మారి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మొత్తం 34 రాష్ట్రాల్లో 400 మందికి ఈ బ్యాక్టీరియా సోకింది. ఇది పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుంది. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి వంటివి వస్తాయి. ఇది ఒక్కొక్కరిలో ఆరు గంటలపాటూ ఉంటుంది. బ్యాక్టీరియా సోకిన ఆరు గంటల తర్వాత ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కొక్కరికి ఆరు రోజుల తర్వాత కూడా వచ్చే అవకాశాలున్నాయి.

అమెరికా, కెనడాకు నౌకల్లో వెళ్లిన ఎర్ర ఉల్లిపాయల్లో ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా చేరింది. ఆ ఉల్లిపాయలు అమెరికాలోని 50 రాష్ట్రాలతోపాటూ, కెనడాలోని అన్ని సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లకు ఆగస్ట్ 1న సప్లై అయ్యాయి. ఆ ఉల్లిలో ఎరుపు, పసుపు, తెలుపు, తీపి పసుపు రంగు ఉల్లిపాయలున్నాయి. వాటన్నింటిలో ఎర్ర ఉల్లిపాయల్లో ఎక్కువగా సాల్మొనెల్లా వైరస్ ఉన్నట్లు గుర్తించింది CDC. థాంప్సన్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి వచ్చిన అన్ని రకాల ఊల్లిపాయలనూ వాడవద్దని CDC హెచ్చరించింది.

సాల్మొనెల్లా లక్షణాలు :

సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిన వారికి డయేరియా, జ్వరం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, తలనొప్పి వంటివి వస్తాయి. 8 గంటల నుంచి 72 గంటల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి 4 రోజుల నుంచి 7 రోజుల పాటూ ఉంటాయి. చాలా మంది డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండానే రికవరీ అవుతారు. ముసలి వాళ్లు, పిల్లలకు ఈ సమస్య వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడమే మేలు. సాల్మొనెల్లో సోకితే ఎక్కువ నీరు తాగాలి. తాగుతూనే ఉండాలి.

ఇలా చేయడం మంచిది

* శుభ్రత పాటించండి. బయటి నుంచి తెచ్చే ఆహారాన్ని బాగా కడగండి. ముఖ్యంగా ఉల్లిపాయల్ని.

* ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలని ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోండి.

* పూర్తిగా వండిన ఆహారాన్నే తినండి. హాఫ్ బాయిల్డ్, హాఫ్ కుక్డ్ ఫుడ్ తినవద్దు.

* కిచెన్ గదిని రోజూ శుభ్రం చేసుకోండి.

* వండిన వంట దగ్గర పక్కనే కూరగాయల్ని ఉంచకండి.

Tags :
|
|

Advertisement