Advertisement

రూ.11 వేలలోనే ప్రముఖ బ్రాండ్ 5జీ ఫోన్ లాంచ్...

By: chandrasekar Thu, 03 Dec 2020 2:04 PM

రూ.11 వేలలోనే ప్రముఖ బ్రాండ్ 5జీ ఫోన్ లాంచ్...


చైనాలో జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. దీనిలో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. ముందువైపు సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇందులో వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను అందించారు. జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ ధర మరియు స్పెసిఫికేషన్లు...

జెడ్‌టీఈ బ్లేడ్ వీ2021 5జీ ఫోన్ లు రెండు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధరను 999 యూరోలుగా(సుమారు రూ.11,200) నిర్ణయించారు.

ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యూరోలుగా(సుమారు రూ.15,700) నిర్ణయించారు.

స్పేస్ గ్రే, ఫాంటసీ బ్లూ, స్పేస్ సిల్వర్ కలర్ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఇక ముందువైపు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది.

ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉంది. దీని బరువు 188 గ్రాములుగానూ, మందం 0.89 సెంటీమీటర్లుగానూ ఉంది.

Tags :
|

Advertisement