Advertisement

కరోనా సోకి ప్రముఖ బాలీవుడ్ నటుడి మృతి..

By: chandrasekar Wed, 11 Nov 2020 9:28 PM

కరోనా సోకి ప్రముఖ బాలీవుడ్ నటుడి మృతి..


ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృభణ కొనసాగుతోంది. దీని బారిన పడి ఎంతో మంది మృతి చెందారు. ఈ వైరస్‌ సోకిన వాళ్లు సరైన వైద్యం తీసుకోకపోతే పైకి వెళ్లడమే. ఇప్పటికే లక్షల మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుతో పాటు ఓ కేంద్ర మంత్రితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నటీనటులు కరోనా కారణంగా ఈ మంగళవారం కన్నుమూశారు.

తాజాగా కరోనాతో మరో బాలీవుడ్ నటుడు హరీష్ బన్చాటా హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో కన్నుమూసారు. ఈయన హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘భజరంగీ భాయిజాన్’తో పాటు పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లో నటించిన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన వయసు 48 సంవత్సరాలు. షిమ్లాకు చెందిన హరీష్ గత 18 ఏళ్లుగా బాలీవుడ్ పలు చిత్రాల్లో నటించారు. అంతేకాదు సీఐడీ, క్రైమ్ పెట్రోల్ వంటి సీరియల్స్‌లో నటించారు. సల్లూ భాయ్.. భజరంగీ భాయిజాన్ సినిమాలో హరీష్ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఈయన కన్నుమూసిన ఒక రోజు ముందే ఆయన తల్లి మృతి చెందడం బాధాకరం.

Tags :

Advertisement