Advertisement

  • ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మశాలలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మ హత్య

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మశాలలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మ హత్య

By: chandrasekar Fri, 13 Nov 2020 10:45 AM

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మశాలలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మ హత్య


ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మశాలలో ఫ్యానుకు ఉరేసుకొని గురువారం ఆత్మ హత్య చేసుకున్నాడు. బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు అసిఫ్ బాస్రా ధర్మశాలలోని ఓ ప్రైవేట్ కాంప్లెక్స్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన వయసు కేవలం 53 సంవత్సరాలు మాత్రమే. కొన్ని రోజులుగా తీవ్రమైన డిప్రెషన్ తో బాధ పడుతున్నాడు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. బాలీవుడ్లో డిప్రెషన్ అనే పదం ఈ మధ్య చాలా వ్యాపిస్తుంది. జూన్ 14న స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా డిప్రెషన్ తోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మరొక ప్రముఖ నటుడు కూడా ఇలాగే సూసైడ్ చేసుకున్నాడు. ఫ్యానుకు ఉరేసుకొని అసిఫ్ మరణించినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న వెంటనే హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ధర్మశాలలోని ఆ కాంప్లెక్స్ కు వెళ్లి విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ టీం కూడా వెళ్లి అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే పనిలో నిమగ్నం అయిపోయారు.

అతని ఆత్మహత్య పై త్వరలోనే పూర్తి వివరాలు మీడియాకు తలియజేస్తామని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు. ఆసిఫ్ మరణవార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న నటులు దర్శకులు నిర్మాతలు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. ఒక అద్భుతమైన నటుడు ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అసలు ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ఏక్ విలన్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, క్రిష్ 3, జబ్ వి మెట్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. దాంతో పాటు తమిళనాడులో సూర్య హీరోగా వచ్చిన అంజాన్ సినిమాలో ఆసిఫ్ నటించాడు. ఈ సినిమా తెలుగులో సికిందర్ పేరుతో విడుదలైంది. ఈ ఏడాది హాట్ స్టార్ లో విడుదలైన హోస్టెజెస్ వెబ్ సిరీస్ లో కూడా అతను నటించాడు. ఇతని మరణంతో ఎంతో మంది అభిమానులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. బాలీవుడ్ నటులు చాలామంది అనతి కాలంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తుంది.

Tags :

Advertisement