Advertisement

  • మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు 'అనిల్ మురళి' కన్ను మూత

మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు 'అనిల్ మురళి' కన్ను మూత

By: chandrasekar Fri, 31 July 2020 09:45 AM

మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు 'అనిల్ మురళి' కన్ను మూత


భారతీయ చలన చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యంతో కొందరు, ఒత్తిడిని జయించలేక ఆత్మహత్యలకు పాల్పడి మరికొందరు మరణిస్తున్నారు. మొన్నటి మొన్న ప్రముఖ నటుడు రావి కొండల రావు అనారోగ్యంతో కన్నుమూసారు. అంతకు ముందు బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఇప్పటికే ఆయన ఆత్మహత్యపై పలు సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. అది మరవక ముందే మరాఠీ నటుడు అశుతోష్ భక్రే ఉరివేసుకొని ప్రాణాలు తీసున్నాడు. తాజాగా మలయాళ చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు అనిల్ మురళి కన్నమూసారు. ఆయన వయసు 56 ఏళ్లు. అనారోగ్య సమస్యలతో కొచ్చిలో ఆయన తుది శ్వాస విడిచారు.

లివర్ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. ఆయన మరణంతో మలయాళ చిత్ర సీమలో మంచి నటుడిని కోల్పోయిందని ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలియజేసారు.

అనిల్ మురళికి భార్య సుమ, పిల్లలు, ఆదిత్యా, అరుంధతి ఉన్నారు. టీవీ సీరియల్స్‌తో తన కెరీర్ ప్రారంభించిన అనిల్ మురళి 1993లో కన్యాకుమారిల్ ఓరు కవితస అనే సినిమాతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఈయన మలయాళం, తమిళం, తెలుగులో దాదాపు 150 చిత్రాల్లో నటించారు. 2020లో ఈయన టోవినో థామస్‌తో కలిసి ‘ఫోరెన్సిక్స్’ మూవీ అనిల్ మురళి చివరి చిత్రం నటించారు.

Tags :
|

Advertisement