Advertisement

  • గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు...మంత్రి హరీశ్

గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు...మంత్రి హరీశ్

By: chandrasekar Sat, 01 Aug 2020 10:40 AM

గ్రామాల్లో  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు...మంత్రి హరీశ్


సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి, బక్రిచెప్యాల, ఏలుపల్లి గ్రామాలలో మంత్రి హరీశ్ పర్యటించారు. జిల్లా పర్యటనలో ఆర్థిక శాఖ మంత్రి బిజీబిజీ గడిపారు. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నాంచారుపల్లి, బక్రిచెప్యాలలో సెగ్రీ గేషన్ షెడ్డు- వర్మీ కంపోస్టు తయారీ కేంద్రాలు, 40 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మిషన్ భగీరథ వాటర్ ట్యాoకు, బక్రి చెప్యాలలో శాలి వాహన కుమ్మరి సంఘ భవనం, రెడ్డి కమ్యూనిటీ హాల్ భవనాలను ప్రారంభించారు.

మంత్రి హరీశ్ రావు ఏలుపల్లి గ్రామంలో గ్రామ ఫంక్షన్ హాల్, యూత్ భవన నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు, వైకుంఠ ధామం, సెగ్రీ గేషన్ షెడ్డు- వర్మీ కంపోస్టు తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. నాంచారుపల్లి షెడ్డులో మరో రెండు నాడెం కంపోస్టు పిట్స్ నిర్మించాలని ఏపీవో నర్సింగరావుకు మంత్రి సూచించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి ఇచ్చేలా గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పర్చాలని సర్పంచ్ కల్పనకు మంత్రి సూచించారు. ఈ మేరకు సెగ్రీ గేషన్ షెడ్లలో సేంద్రియ ఎరువుకు సిద్ధం చేసిన చెత్తను నాడెం కంపోస్టు పిట్ లో వేశారు.

అదే విధంగా రాఖీ పండుగను పురస్కరించుకుని బక్రి చెప్యాల గ్రామ మహిళా సంఘం ప్రతినిధి మంత్రికి రాఖీ కట్టారు. బక్రిచెప్యాల గ్రామంలో శాలి వాహన కుమ్మరి సంఘ భవనం ప్రారంభించారు. సారే పట్టి కుండలు తయారు చేస్తున్న విధానాన్ని మంత్రి పరిశీలించి, తానూ ఒక్క కుండ తయారు చేస్తానని మంత్రి కాసేపు కుమ్మరి సారే పట్టి కుండ తయారు చేశారు. మంత్రి వెంట సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సర్పంచ్ కల్పన, బక్రిచెప్యాల సర్పంచ్, పీఆర్ డీఈ వేణు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :
|

Advertisement