Advertisement

కశ్మీర్‌ ప్రజలు ఉనికిని కోల్పోయేలా చట్టాలు...

By: chandrasekar Wed, 04 Nov 2020 7:02 PM

కశ్మీర్‌ ప్రజలు ఉనికిని కోల్పోయేలా చట్టాలు...


పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ 'కశ్మీర్‌ యువత భవిష్యత్‌ను రక్షించేందుకు ఎంత దూరమైనా వెళ్తామని' అన్నారు. ‘గతంలో ప్రజలను సంప్రదించి చట్టాలు రూపొందించారు. అందుకే అవి ప్రజలకు అనుకూలంగా నిలిచాయి.

కానీ ప్రస్తుత పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వంలో కశ్మీర్‌ ప్రజలు తమ ఉనికిని కోల్పోయేలా చట్టాలు తెస్తోంది’ అని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిని తాము ఏ మాత్రం సహించబోమని ఆమె పేర్కొన్నారు. దేశ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తుందని ఆరోపించారు.

కుల, మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్‌ వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

హిందుత్వవాద కార్యకర్త అమరేందర్‌ సింగ్‌ బోపరాయ్‌తోపాటు పలువురు కశ్మీర్‌లోని పీడీపీ కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేసి కార్యాలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మోహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. బీజేపీ తీరును ఎండగట్టారు.

Tags :
|
|

Advertisement