Advertisement

లావా జెడ్66 మనదేశంలో లాంచ్...దీని ధర రూ. 8 వేలలోపు

By: chandrasekar Wed, 05 Aug 2020 9:00 PM

లావా జెడ్66 మనదేశంలో లాంచ్...దీని ధర రూ. 8 వేలలోపు


ఇండియాలో లావా జెడ్66 లాంచ్ చేసారు. దీనిలో వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ను అందించారు. దీంతోపాటు 3950 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లేను ఇందులో అందించారు. ప్రస్తుతానికి ఆఫ్ లైన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

లావా జెడ్66 ధర

ఈ స్మార్ట్ ఫోన్ లో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో రానున్న దీని ధరను రూ.7,777గా నిర్ణయించారు. మెరైన్ బ్లూ, బెర్రీ రెడ్, మిడ్ నైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.దీని సేల్ ప్రస్తుతానికి ఆఫ్ లైన్ లో ప్రారంభం అయింది. త్వరలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల్లో కూడా దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

జెడ్66 స్పెసిఫికేషన్లు

దీనిలో 6.08 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. 1.6 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్ ను ఇందులో అందించారు. 32 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, మరో 5 మెగా పిక్సెల్ కెమెరాను కూడా అందించారు. సెల్ఫీల కోసం ముందువైపు 13 మెగా పిక్సెల్ కెమెరా అందుబాబులో ఉన్నాయి.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. వైఫై, బ్లూటూత్ వీ4.2, మైక్రో యూఎస్ బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో అందించారు. బ్యాటరీ సామర్థ్యం 3950 ఎంఏహెచ్ గా ఉంది. 16 గంటల బ్యాటరీ బ్యాకప్ దీని ద్వారా లభించనున్నట్లు లావా తెలిపింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనకవభాగంలో ఉంది. ఫేస్ అన్ లాక్ ఫీచర్ ను కూడా అందించారు. ఈ ఫోన్ మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 162 గ్రాములుగా ఉంది. ప్రస్తుతం రూ. 8 వేలల్లో అందుబాటులో ఉన్న భారతీయ ఫోన్లలో ఇదే బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. మిగతా బ్రాండ్లు ఇన్ని ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను ఇంతవరకు లాంచ్ చేయలేదు. చైనా బ్రాండ్లపై బాన్ కారణంగా ఈ ఫోన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.

Tags :
|
|

Advertisement