Advertisement

  • జెడ్61 ప్రో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా

జెడ్61 ప్రో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా

By: chandrasekar Fri, 10 July 2020 5:58 PM

జెడ్61 ప్రో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా


నదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా. అదే లావా జెడ్61 ప్రో స్మార్ట్ ఫోన్. అతి తక్కువ ధరలో ప్రాథమిక శ్రేణిలో ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ కు పైన, కింద బెజెల్స్ ఉన్నాయి. ఆక్టాకోర్ ప్రాసెసర్ ను ఇందులో అందించారు. ఈ ఫోన్ లో కేవలం 2 జీబీ ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.5,774గా నిర్ణయించారు.

మిడ్ నైట్ బ్లూ, యాంబర్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల్లో అందుబాటులో ఉండనుందని లావా తెలిపింది. ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇందులో 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 18:9గా ఉంది. 1.6 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ను ఇందులో అందించారు. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా దీన్ని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇందులో వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. పొర్ ట్రెయిట్ మోడ్, బరస్ట్ మోడ్, పనోరమ, ఫిల్టర్స్, బ్యూటీ మోడ్, హెచ్ డీఆర్, నైట్ మోడ్ లు కూడా ఇందులో ఉన్నాయి. లావా జెడ్61 ప్రో స్మార్ట్ ఫోన్ లో 3,100 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. బ్లూటూత్ 4.2, వైఫై, జీపీఎస్, యూఎస్ బీ ఓటీజీ సపోర్ట్, మైక్రో యూఎస్ బీ పోర్టు కూడా ఉన్నాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు. సెక్యూరిటీ కోసం ఫేస్ అన్ లాక్ ఫీచర్ ను ఇచ్చారు.

Tags :
|

Advertisement