Advertisement

రియల్ మీ సీ11 లాంచ్

By: chandrasekar Wed, 15 July 2020 6:14 PM

రియల్ మీ సీ11 లాంచ్


మనదేశంలో రియల్ మీ సీ11 లాంచ్ అయింది. ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్, భారీ బ్యాటరీని అందించారు. ఇందులో వాటర్ డ్రాప్ తరహా డిస్ ప్లే, అందుబాటులో ఉంది. ఒకే ఒక్క స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ జూన్ నెలాఖరులో మలేషియాలో లాంచ్ అయింది.

స్పెసిఫికేషన్లు


దీనిలో 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్ ను ఇందులో అందించారు.

ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ వెనకభాగంలో అందించారు. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ గా ఉండగా, దీంతోపాటు మరో 2 మెగా పిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

32 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో 5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. రివర్స్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 4జీ, వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బరువు 196 గ్రాములుగా ఉంది.

రియల్ మీ సీ11 ధర


రియల్ మీ సీ11లో కేవలం 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. రిచ్ గ్రీన్, రిచ్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్లలో దీనికి సంబంధించిన సేల్ జులై 22వ తేదీ జరగనుంది. రియల్ మీ సీ11 ఆఫ్ లైన్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Tags :
|

Advertisement