Advertisement

బడ్జెట్ ధరలో ఎల్జీ క్యూ31ను లాంచ్

By: chandrasekar Sat, 19 Sept 2020 09:14 AM

బడ్జెట్ ధరలో ఎల్జీ క్యూ31ను లాంచ్


ప్రముఖ కొరియన్ కంపెనీ LG బడ్జెట్ ఫోన్ క్యూ31ను లాంచ్ చేసింది. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థ ఎల్జీ తన కొత్త బడ్జెట్ ఫోన్ ఎల్జీ క్యూ31ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతానికి కొరియాలో లాంచ్ అయింది. తక్కువ ధరలోనే ఈ ఫోన్ లాంచ్ అవ్వడం విశేషం. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 3 జీబీ ర్యామ్‌ను అందించారు. వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఇందులో ఉంది. ఇందులో ప్రత్యేకంగా గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను అందించారు. ఇందులో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ వేరియంట్ ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను 2,09,000 కొరియా వాన్‌లుగా (సుమారు రూ.13,200) నిర్ణయించారు. ఈ ఫోన్‌కు సంబంధించిన సేల్ దక్షిణకొరియాలో సెప్టెంబర్ 25వ తేదీ నుంచి జరగనుంది. మెటాలిక్ సిల్వర్ రంగులో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ భారత్ దేశంలో ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న విషయం తెలియలేదు.

ఎల్జీ క్యూ31 స్పెసిఫికేషన్ వివరాలు:

* ఈ ఫోన్ లో 5.7 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు.

* మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.

* 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా ఇందులో దీన్ని 2 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

* ఇందులో వెనకవైపు 13 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు అందించారు.

* సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

* దీని బ్యాటరీ సామర్థ్యం 3,000 ఎంఏహెచ్ గా ఉంది.

* వైఫై, ఎల్టీఈ సపోర్ట్, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్ బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు.

* ఇందులో ప్రత్యేకంగా గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఇందులో ఉంది. దీని మందం 0.87 సెంటీమీటర్లుగానూ, బరువు 145 గ్రాములుగానూ ఉంది.

Tags :
|
|
|
|

Advertisement