Advertisement

రియల్‌మి 6 సిరీస్‌లో సరికొత్త ఫోన్‌ లాంచ్

By: chandrasekar Sat, 25 July 2020 3:43 PM

రియల్‌మి 6 సిరీస్‌లో సరికొత్త ఫోన్‌ లాంచ్


రియల్‌మి 6 సిరీస్‌లో సరికొత్త ఫోన్‌ను చైనాకు చెందిన రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఇవాళ లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ధరలో రియల్‌మి 6i స్మార్టఫోన్‌ని భారత్‌లో విడుదల చేసింది.

ఫోన్‌లో ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌, వెనుకవైపు నాలుగు కెమెరాలు, హోల్‌-పంచ్‌ డిజైన్‌తో సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి.

4GB + 64GB, 6GB + 64GB. వేరియంట్లలో ఫోన్‌ విడుదలైంది. 4జీబీ వేరియంట్‌ ధర రూ. 12,999కాగా, 6జీబీ ధర రూ. 14,999గా నిర్ణయించారు.

రియల్‌మి 6ఐ ఎక్లిప్స్‌ బ్లాక్‌, లూనార్‌ వైట్‌ కలర్లలో అందుబాటులో ఉన్నది. జూలై 31 నుంచి రియల్‌మి.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఫోన్లను విక్రయిస్తామని కంపెనీ తెలిపింది.

Tags :
|
|

Advertisement