Advertisement

యమహా నుండి కొత్త వింటేజి ఎడిషన్ FZS-Fi బైక్ లాంచ్

By: chandrasekar Wed, 02 Dec 2020 09:31 AM

యమహా నుండి కొత్త వింటేజి ఎడిషన్ FZS-Fi బైక్ లాంచ్


యువకులను అట్టే ఆకట్టుకునే యమహా బైక్ తన కొత్త ఎడిషన్ ను విడుదల చేసింది. కొత్త ఫీచర్ లతో ఈ బైక్ అలరించనుంది. యమహా మోటార్ సైకిల్స్ కు భారత్ లో ఎంతో క్రేజ్ వుంది. సరికొత్త మోడల్స్ మార్కెట్లో విడుదల చేస్తూ అత్యుత్తమ విక్రయాలు అందుకుంటోంది. తాజాగా ఈ సంస్థ నుంచి సరికొత్త ఎడిషన్ లాంచ్ అయింది. యమహా వింటేజి ఎడిషన్ FZS-Fi. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ. 1.09 లక్షలుగా సంస్థగా నిర్దేశించింది. స్టాండర్డ్ వేరియంట్ కంటే 5 వేల రూపాయల ధర ఎక్కువగా ఉంది. అత్యాధునిక ఫీచర్లు, అప్డేట్లతో బైక్ ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త మోడల్ లో వచ్చిన ఈ యమహా బైక్ డిసెంబరు మొదటి వారం నుంచి అన్ని అధికారిక డీలర్లలో అందుబాటులోకి రానుంది. స్టైలింగ్ విషయానికొస్తే ఈ బైక్ స్టాండర్డ్ మోడల్ మాదిరే ఉంది. అంతేకాకుండా వింటేజి బాడీ గ్రాఫిక్స్ ఐకానిక్ లెగసీ, న్యూ లెదర్ ఫినిష్ సింగిల్ పీస్ టూ లెవల్ సీట్ తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంది. అంతేకాకుండా యమహా మోటార్ సైకిల్ కనెక్ట్ ఎక్స్ అప్లికేషన్ ద్వారా ఈ బ్లూటూత్ ను అనుసంధానం చేసుకోవచ్చు.

మంచి పికప్ తో ఈ బైక్ దూసుకెళ్లనుంది. యమహా వింటేజి ఎడిషన్ ఎఫ్ జెడ్ఎస్-ఏఫ్ఐ మోటార్ సైకిల్ చెప్పుకోదగ్గ మరో మార్పు ఇంజిన్. ఇది 149 సీసీ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉండి 7250 ఆర్పీఎం వద్ద 12.2 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 5500 ఆర్పీఎం వద్ద13.6 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ మోటార్ సైకిల్ కు ఫ్రంట్ వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ మోనోషాక్ సెటప్ ఉంది. ఇవి కాకుండా ఈ సరికొత్త బైక్ 282 ఎంఎం, 220ఎంఎం ముందు, వెనక డిస్క్ బ్రేకులను కలిగి ఉంది. ఈ బైక్ 13 లీటర్ల- ఇంధన ట్యాంకు సామర్థ్యాన్ని కలిగింది. ఈ బైక్ బరువు 137 కిలోలుగా ఉంది. ముఖ్యంగా కుర్రకారును ఆకర్షిస్తోన్న ఈ బైక్ యూనిక్ స్టైలింగ్ ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా దీనికి స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. యమహా ఎఫ్ జెడ్ఎస్-ఎఫ్ఐ మోటార్ సైకిల్ కు పోటీగా భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ 150, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160, సుజుకీ జిక్సెర్ 155 లాంటి మోటార్ సైకిళ్లు ఉన్నాయి. కొత్త యమహా బైక్ మిగిలిన వాటికి గట్టి పోటీనివ్వనుంది.

Tags :
|

Advertisement