Advertisement

మోటో ఈ7 ప్లస్ లాంచ్

By: chandrasekar Sat, 12 Sept 2020 09:54 AM

మోటో ఈ7 ప్లస్ లాంచ్


ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటో ఈ7 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. మోటో ఈ7 ప్లస్ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ బ్రెజిల్ లో లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను కూడా కంపెనీ ప్రారంభించింది. ఇందులో వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్, వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లేను ఇందులో అందించారు.

ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఈ ఫోన్ ను లాంచ్ చేసినప్పటికీ దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇందులో కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. యాంబర్ బ్రోంజ్, నేవీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.

మోటో ఈ7 ప్లస్ స్పెసిఫికేషన్లు:

* ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు.

* ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ వెనకభాగంలో అందించారు.

* ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

* దీని ర్యామ్ 4 జీబీగానూ, స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీగానూ ఉంది. స్టోరేజ్ ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.

* ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, మరో 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై మోటో ఈ7 ప్లస్ పనిచేయనుంది.

* 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

* 4జీ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.92 సెంటీమీటర్లు కాగా, బరువు 200 గ్రాములుగా ఉంది.

Tags :
|

Advertisement