Advertisement

  • గ్రేట‌ర్ చెన్నై కార్పొరేష‌న్ ప‌రిధిలో మొబైల్ అమ్మ క్యాంటీన్లు ప్రారంభం...

గ్రేట‌ర్ చెన్నై కార్పొరేష‌న్ ప‌రిధిలో మొబైల్ అమ్మ క్యాంటీన్లు ప్రారంభం...

By: chandrasekar Thu, 05 Nov 2020 4:18 PM

గ్రేట‌ర్ చెన్నై కార్పొరేష‌న్ ప‌రిధిలో మొబైల్ అమ్మ క్యాంటీన్లు ప్రారంభం...


చెన్నై: గ్రేట‌ర్ చెన్నై కార్పొరేష‌న్ ప‌రిధిలో బుధ‌వారం మొబైల్ అమ్మ క్యాంటీన్ల‌ను త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కే ప‌ళ‌నిస్వామి ప్రారంభించారు. వీటితో పాటు రూ. 324 కోట్ల విలువైన ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. రూ. 294.15 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన ప‌లు ప్రాజెక్టుల‌ను సీఎం ప్రారంభించారు. గ్రేట‌ర్ చెన్నై కార్పొరేష‌న్ ప‌రిధిలో అమ్మ క్యాంటీన్ల వాహ‌నాల‌ను ప‌చ్చ‌జెండా ఊపి ప్రారంభించారు. అనంత‌రం అమ్మ క్యాంటీన్‌లోనే ప‌ళ‌నిస్వామి భోజ‌నం చేశారు. ఈ మొబైల్ క్యాంటీన్ల‌ను భ‌వ‌న నిర్మాణ ప‌నులు జ‌రిగే చోట‌, కార్మికులు ర‌ద్దీగా ఉండే ప్రాంతాల్లో అందుబాటులో ఉంచబోతున్నారు.

సీఎం ప‌ళ‌నిస్వామి..35 వేల లీట‌ర్ల సామ‌ర్థ్యం క‌లిగిన ఆక్సిజ‌న్ ట్యాంక్‌ను సీఎం ప్రారంభించారు. ఈ ట్యాంక్ నుంచి సేలంలోని గ‌వ‌ర్న‌మెంట్ మోహ‌న్ కుమార‌మంగ‌ళం మెడికల్ కాలేజీ ఆస్ప‌త్రికి ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. దీన్ని రూ. 1.14 కోట్ల వ్య‌యంతో నిర్మించారు. థేని జిల్లాలో ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ వాట‌ర్ ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేశారు. ఈ ప్రాజెక్టును రూ. 162.43 కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 250 గ్రామాలకు తాగునీరు అంద‌నుంది.

Tags :
|
|

Advertisement