Advertisement

  • కరోనా కేసుల్లో చాలా వరకు లక్షణాలు ఉండటం లేదు .. భారత సంతతి శాస్త్రవేత్త మోనికా గాంధీ

కరోనా కేసుల్లో చాలా వరకు లక్షణాలు ఉండటం లేదు .. భారత సంతతి శాస్త్రవేత్త మోనికా గాంధీ

By: Sankar Mon, 10 Aug 2020 1:06 PM

కరోనా కేసుల్లో చాలా వరకు లక్షణాలు ఉండటం లేదు .. భారత సంతతి శాస్త్రవేత్త మోనికా గాంధీ



కరోనా వైరస్ ..ఈ పేరు వింటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు ..చైనాలో వుహాన్ లో స్టార్ట్ అయి దాదాపు ఎనిమిది నెలలు పైననే అవుతున్నప్పటికీ ఇంకా వైరస్ కు ఎటువంటి వాక్సిన్ రాలేదు సరి కదా ..కొత్త కొత్త లక్షణాలు బయట పడుతున్నాయి. ఇప్పటి వరకూ సుమారు 2 కోట్ల మంది వైరస్ బారినపడగా.. వీరిలో 7.26 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నమోదవుతున్న కేసుల్లో 40 శాతం మందికి ఎటువంటి లక్షణాలు బయటపడటంలేదని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది.

‘అమెరికాలోని బోస్టన్ షెల్టర్ హోం‌లో 147 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 88 శాతం మందికి, టైసన్ ఫుడ్ పౌల్ట్రీ ప్లాంట్‌లో 481 మందికి వైరస్ సోకగా.. 95 శాతం మందికి, ఉత్తర కరోలినా, ఓహియో, వర్జీనియా జైళ్లలోని 3,277 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా.. 96 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు బయటపడలేదు’ అని భారత సంతతి శాస్త్రవేత్త మోనికా గాంధీ తెలిపారు.

లక్షణాల లేనివారు అనారోగ్యానికి గురైన వారితో కలిసి జీవించినా లేదా పనిచేసినా ఎటువంటి ప్రభావం చూపకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని, బాధితుల్లో వైరస్ తీవ్రతలో తేడా ఉందా? ఇది జన్యుపరమైందా? అవగాహనకు విరుద్ధంగా కొంతమందికి ఇప్పటికే వైరస్‌కు పాక్షిక నిరోధకత ఉందా? అనే తెలుసుకునే ప్రయత్నం చేశామని అన్నారు.

బాధితుల్లో వైవిధ్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు చివరకు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయి.. వ్యాక్సిన్, చికిత్సల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ జ్ఞానం సహాయపడుతుందనే ఆశను పెంచుతుంది. రోగనిరోధక శక్తి విషయంలో కొత్త మార్గాలను అన్వేషించవచ్చు.. చాలా మందిలో తేలికపాటి లక్షణాలు ఉంటున్నాయి.. ఇది వైరస్ వ్యాప్తి నిరోధించి, మహమ్మారి ముగింపునకు తోడ్పడుతుందని’ అని అతన్నారు.ఎటువంటి లక్షణాలు లేని పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదుకావడం శుభపరిణామని, ఇది వ్యక్తి, సమాజానికి మంచి విషయమని కాలిఫోర్నియా యూనివర్సిటీ అంటువ్యాధుల విభాగం నిపుణురాలు మోనికా గాంధీ అన్నారు.

Tags :
|
|
|

Advertisement