Advertisement

ఎవరికీ తెలియని సీక్రెట్ బయటపెట్టిన 'లాస్యా'

By: chandrasekar Fri, 13 Nov 2020 10:38 AM

ఎవరికీ తెలియని సీక్రెట్ బయటపెట్టిన 'లాస్యా'


ఎవరికీ తెలియని సీక్రెట్ ను లాస్యా బయటపెట్టింది. వామ్మో లాస్య ప్రేమ కథలో మామూలు ట్విస్ట్‌లు లేవుగా సినిమా కథను తలపించేలా ఒక్కో గుట్టు విప్పుతోంది. 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్న లాస్య 2017 వరకూ పేరెంట్స్‌కి దూరంగానే ఉంది. ఆ తరువాత 2017లో పెద్దలు ఒప్పుకోవడంతో అదే వ్యక్తిని రెండోసారి పెళ్లాడింది. అయితే మధ్యలో 2014లో ఆమె ప్రెగ్నెంట్ కావడం దాన్ని ఎవరికీ తెలియకుండా తీయించుకోవడం మళ్ళీ తిరిగి 2018లో ప్రెగ్నెంట్ కావడం ఆమెకు కొడుకు పుట్టడం లాంటి సీక్రెట్స్‌ను ఇప్పటికే బిగ్ బాస్ ప్రేక్షకులకు లాస్యా తెలియజేసింది. కానీ, గురువారం నాటి ఎపిసోడ్‌లో ఇప్పటివరకూ ఎవరికీ తెలియని సీక్రెట్ చెప్పాలని బిగ్ బాస్ కోరడంతో తన భర్త తనకంటే ఏడాది చిన్నవాడని సీక్రెట్‌ని భయటపెట్టింది. అంతేకాదు అతను చాలా పేదవాడని ఏం లేదని చెప్పుకొచ్చింది. దీనిని విని చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు.

తన సీక్రెట్ లో భాగంగా లాస్య మాట్లాడుతూ 2017లో పెద్దల సమక్షంలో మా పెళ్లి అయ్యింది. పెళ్లైనప్పుడు నేను ఒక మరాఠీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నా అని అందరూ అనుకున్నారు. కోటీశ్వరుడు డబ్బులున్న అబ్బాయి అనుకున్నారు. తను మిడిల్ క్లాస్ కూడా కాదు. అతని ఫైనాన్సియల్ స్టేటస్ నాకు మాత్రమే తెలుసు. నాకంటే ఆ అబ్బాయి ఒక సంవత్సరం చిన్న. ఆ విషయం తెలిసిన తరువాత నాకంటే ఏడాది చిన్నవాడ్ని నేను లవ్ చేశానా అని ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. ఈ సీక్రెట్ మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఈ షోకి వచ్చాక షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నా అమ్మా మీ అల్లుడు నాకంటే ఏడాది చిన్నోడు కానీ వయసులో చిన్నవాడైనా పెద్ద మనసు చాలా బాగా చూసుకుంటాడు అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది లాస్య. మొత్తానికి ఈ బిగ్ బాస్ అయ్యేలోపు లాస్య ప్రేమ కథలో ఇంకెన్ని సీక్రెట్స్ బయటపడతాయో ఆమె ఇంకెన్ని సార్లు ఏడుస్తుందో వాళ్ల పేరెంట్స్‌కి ఇంకెన్ని షాక్‌లు ఇస్తుందో చూడాలి మరి. ఆమె చెప్పిన సీక్రెట్స్ విని చాలామంది ఆశ్చర్యపోయారు.

Tags :
|

Advertisement