Advertisement

  • గుడ్ న్యూస్ ..నిమ్స్ లో చివరి దశకు చేరిన కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

గుడ్ న్యూస్ ..నిమ్స్ లో చివరి దశకు చేరిన కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

By: Sankar Wed, 12 Aug 2020 3:51 PM

గుడ్ న్యూస్ ..నిమ్స్ లో చివరి దశకు చేరిన కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్



ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని నిర్ములించడానికి వాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి ..ఇప్పటికే రష్యా వాక్సిన్ ను ప్రకటించగా , ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ , అమెరికా తయారు చేసే వాక్సిన్ లు కూడా చివరి దశకు చేరుకున్నాయి..ఇక ఇప్పుడు భారత్ కూడా తాను తయారు చేసే వాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్నో ఆశలు నింపిన ఈ కోవాక్జిన్ మొదటి దశ ప్రయోగాలను పూర్తి చేసుకొని రెండో దశలోనూ మెరుగైన ఫలితాలను చూపించినట్లు నిమ్స్ వర్గాలంటున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 50మందికి కోవాక్జిన్ ఫస్ట్ డోస్ ఇవ్వగా, అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తేలింది. అందులో 14 రోజులు గడిచిన వారిలో కొందరిని ఎంపిక చేసి నిర్ధారిత సమయాల్లో బూస్టర్‌ డోస్‌ ఇస్తున్నారు. అందరి ఆరోగ్య పరిస్థితిని వీడియో కాల్‌ ద్వారా ప్రతి రోజూ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత 24 గంటలపాటు ఆస్పత్రిలోనే ఉంచి..ఆరోగ్యం నిలకడగా ఉంటేనే ఇళ్లకు పంపిస్తున్నారు.

దీంతో రెండో ఫేజ్ లో భాగంగా ఇప్పటి వరకు ఎడుగురికి రెండో దశలో బూస్టర్ డోస్ ఇచ్చినట్లు నిమ్స్ వర్గాలు తెలిపాయి. వీరిని 24గంటల పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణ ఉంచుకొని ఆ తర్వాత ఇంటికి పంపిస్తున్నామని, ప్రతి రోజు వీడియో కాల్ ద్వారా మానిటర్ చేస్తున్నట్లు నిమ్స్ ఆసుపత్రి తెలిపింది. రెండో డోసు తీసుకున్న ఏడుగురితో కలిపి మొదటి డోసు వేసుకున్న వారందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్య బృందం నిర్ధారించుకుంది.ఎవరిలోనూ ఇతర ఇబ్బందులు లేవని ఆసుపత్రి తెలిపింది.

Tags :
|
|

Advertisement