Advertisement

  • కరోనా కారణంగా పెద్ద ఎత్తున పెరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు

కరోనా కారణంగా పెద్ద ఎత్తున పెరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు

By: chandrasekar Wed, 28 Oct 2020 8:21 PM

కరోనా కారణంగా పెద్ద ఎత్తున పెరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంపై అప్పుల భారం పెరుగుతోంది. బడ్జెట్ లోటును తీర్చడానికి రాష్ట్రాలు కూడా ఎక్కువగా అప్పులు చేస్తున్నట్లు కేంద్ర బ్యాంకు పేర్కొంది. ప్రపంచంలోనే భారీగా వలసలు భారత్ నుండి ఉంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ పైన ప్రజారోగ్య సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాడటంలో ప్రభుత్వాలు ముందున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నివేదికలో పేర్కొంది. ఓ వైపు పన్నులు తగ్గి, మరోవైపు అధిక వ్యయాలు కావడంతో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపింది. భారత ఫెడరల్ ప్రభుత్వం రుణ ప్రణాళికను రెండోసారి 13 ట్రిలియన్ రూపాయలకు (177 బిలియన్ డాలర్లు) కు సవరించింది. జీఎస్టీ కలెక్షన్లు భారీగా తగ్గడంతో రాష్ట్రాలకు పరిహారం కోసం 1.1 ట్రిలియన్ రూపాయలకు అంగీకరించింది. కరోనా దెబ్బతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఆర్థిక సంకోచం కూడా ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 10 శాతం మేర ప్రతికూలత నమోదు చేస్తుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల జాతీయోత్పత్తిలో 2.8 శాతం స్థూల ద్రవ్యలోటును బడ్జెట్‌లో పొందుపరిచినట్లు రాష్ట్రాల బడ్జెట్ పైన చేసిన సర్వే ఆధారంగా వెల్లడవుతోంది. మార్చి 2020తో ముగిసిన ఆర్థికసంవత్సరంలోని 3.2శాతంతో పోల్చినా లేదా 3శాతం పరిమితితో పోల్చినా తక్కువే అయినప్పటికీ కరోనా కారణంగా ఈ అంచనాలు తలకిందులవుతాయని ఆర్బీఐ భావిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లక్ష్యాలను, అసోసియేటెడ్ రిసిప్ట్స్‌ను కరోనా మహమ్మారి దెబ్బతీసే పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర బ్యాంకు పేర్కొంది. ఋణ పెరుగుదల వంటివి రాష్ట్రాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోందని తెలిపింది. 2026 నుండి ఒత్తిడి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని రాష్ట్రాల రుణ పరిపక్వత ప్రొఫైల్ సూచిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ప్రోవిన్స్ బారోయింగ్స్ పెరగవచ్చునని చెబుతోంది.

రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అంతరం డబుల్ డిజిట్‌కు చేరుకుంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. బ్లూమ్‌బర్గ్ ఆర్థికవేత్తల సర్వే ప్రకారం ప్రభుత్వం లక్ష్యం 3.5 శాతంతో పోలిస్తే జీడీపీలో 8 శాతానికి పెరుగుతుందని అంచనా. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సౌకర్యాన్నిపెంచింది. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంపై సడలింపులు వచ్చాయి.

Tags :

Advertisement