Advertisement

  • లంక ప్రీమియర్ లీగ్ వాయిదా ..ఆనందములో ముంబై ఇండియన్స్

లంక ప్రీమియర్ లీగ్ వాయిదా ..ఆనందములో ముంబై ఇండియన్స్

By: Sankar Wed, 12 Aug 2020 3:46 PM

లంక ప్రీమియర్ లీగ్ వాయిదా ..ఆనందములో ముంబై ఇండియన్స్



మరికొద్ది రోజుల్లో ప్రారంభం కావాల్సిన లంక ప్రీమియర్ లీగ్ వాయిదా పడింది ..ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 20 వరకూ ఈ టోర్నీని నిర్వహించాలని షెడ్యూల్‌ని కూడా ప్రకటించింది. కానీ.. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఆ దేశంలో 14 రోజుల క్వారంటైన్ ప్రొటోకాల్‌ నిబంధన ఈ టోర్నీని వాయిదాపడేలా చేసింది.

షెడ్యూల్ ప్రకారం మరో 17 రోజుల్లో లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభంకావాల్సి ఉంది. మొత్తం ఐదు జట్లు ఈ టోర్నీలో పోటీపడనుండగా.. వివిధ దేశాలకి చెందిన దాదాపు 70 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఇందులో ఆడతారని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ.. వీరిలో చాలా మంది మంగళవారానికి అక్కడికి చేరుకోలేకపోయారు.

మరోవైపు ఆటగాళ్ల క్వారంటైన్ గడువుని వారానికి కుదించాలని శ్రీలంక ప్రభుత్వాన్ని.. లంక క్రికెట్ బోర్డు కోరగా.. అందుకు గవర్నమెంట్ నిరాకరించింది. దాంతో.. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు నిర్వహించలేమని నిర్ధారణకి వచ్చిన బోర్డు.. లంక ప్రీమియర్ లీగ్‌ని నవంబరుకి వాయిదా వేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఈ టోర్నీ ముగిసి తర్వాత నవంబరు 20 నుంచి డిసెంబరు 12 వరకూ లంక ప్రీమియర్ లీగ్‌ని నిర్వహించేందుకు అవకాశాలున్నట్లు లంక బోర్డు తెలిపింది..అయితే లంక ప్రీమియర్ లీగ్ వాయిదా పడటంతో ఐపీయల్ అత్యంత ఆనందంగా ఉన్న జట్టు ఏదయినా ఉందా అంటే అది ముంబై ఇండియన్స్ మాత్రమే ..ఎందుకంటే ఆ జట్టు స్టార్ ఆటగాడు లసిత్ మలింగా లంక లీగ్ వాయిదా పడటంతో తొలి మ్యాచ్ నుంచే ముంబై ఇండియన్స్ జట్టుతో అందుబాటులో ఉంటాడు ..ఇక ఆర్సీఐబి కూడా శ్రీలంక కు చెందిన మరో ఆటగాడు ఉదాన ను 50 లక్షలకు కొనుగోలు చేసింది

Tags :
|
|

Advertisement