Advertisement

  • ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పై విరిగిపడిన కొండచరియలు ..

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పై విరిగిపడిన కొండచరియలు ..

By: Sankar Tue, 13 Oct 2020 6:00 PM

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పై విరిగిపడిన కొండచరియలు ..


విజయవాడలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి... ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తుల రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడగానే ఘాట్‌ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను అధికారులు నిలిపివేశారు.

హుటాహుటిన సహాయక బృందాలను రంగంలోకి దింపి... రాళ్లను తొలగించే పనులు చేపట్టారు. ఇక నాలుగు స్తంభాల సెంటర్ లో కొండచరియలు విరిగి నివాసాల మీద పడటంతో మట్టిలో కూరుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. అలానే అక్కడక్కడా ఈ కొండ చరియలు విరిగి పడుతూ ఉండడంతో విజయవాడలో కొండ ప్రాంత వాసుల్లో టెన్షన్ నెలకొంది.

భారీ నుంచి అతి భారీలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండటంతో అలర్టైన కార్పొరేషన్ అధికారులు, కొండచరియల ధాటికి గురయ్యే నివాసాలను ఖాళీ చేయిస్తున్నారు. విద్యాధరపురం గుప్తా సెంటర్ లోని 16 కుటుంబాలను ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు. అయితే తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలంటున్న నిర్వాసితులు కోరుతున్నారు.

గుప్తా సెంటర్ లో సుమారు 8 ఇళ్లపై కొండ చరియలు విరిగిపడగా ఇళ్లు పాక్షికంగా ధ్వంసం అయ్యయ్యి. కుమ్మరిపాలెం ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు, ఒకరికి పరిస్థితి విషమంగా ఉండడం ఆస్పత్రికి తరలించారు. అలానే కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు సూచనలు చేస్తున్నారు.

Tags :

Advertisement