Advertisement

  • ఇత‌ర ప్రాంతాల‌తో పోల్చుకుంటే జ‌మ్ముక‌శ్మీర్‌లో భూముల ధ‌ర‌లు చాలా త‌క్కువ

ఇత‌ర ప్రాంతాల‌తో పోల్చుకుంటే జ‌మ్ముక‌శ్మీర్‌లో భూముల ధ‌ర‌లు చాలా త‌క్కువ

By: chandrasekar Thu, 29 Oct 2020 4:42 PM

ఇత‌ర ప్రాంతాల‌తో పోల్చుకుంటే జ‌మ్ముక‌శ్మీర్‌లో భూముల ధ‌ర‌లు చాలా త‌క్కువ


కేంద్ర ప్ర‌భుత్వం జ‌మ్ముక‌శ్మీర్‌లో ఇత‌రులు ఎవ‌రైనా భూములు కొనుగోలు చేసేందుకు వీలుగా ఆర్టిక‌ల్ 35 A‌లోని సెక్ష‌న్ 17కు స‌వ‌ర‌ణ‌లు చేసింది. దీంతో ఇప్పుడు ఎవ‌రైనా అక్క‌డ భూములు కొని వ్యాపారం చేసుకునేందుకు, లేదంటే అక్క‌డి భూములు కొనుగోలు చేసి స్థిర నివాసం ఏర్ప‌ర్చుకునేందుకు అవ‌కాశం క‌లిగింది. కేంద్రం చేసిన ఈ మార్పు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార‌స్తుల‌కు, అక్క‌డ భూములు కొనాల‌నుకునే ఇత‌రుల‌కు ఒక వ‌రంలా మారింది. ఎందుకంటే ఇన్నాళ్లు అక్క‌డ ఇత‌రులకు భూములు కొనుగోలు చేసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో అక్క‌డి భూముల‌కు కూడా అంత‌గా డిమాండ్ లేదు. దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌తో పోల్చుకుంటే అక్క‌డి ధ‌ర‌లు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు శ్రీన‌గ‌ర్‌లో ఇప్ప‌టికి కూడా చ‌ద‌ర‌పు అడుగు భూమి ధ‌ర రూ.2,200 నుంచి రూ.4,000 మ‌ధ్య ప‌లుకుతున్న‌ది. దేశంలోని ట‌య‌ర్‌ 2, ట‌య‌ర్‌ 3 న‌గ‌రాల్లోని ధ‌ర‌ల‌తో పోల్చి చూస్తే ఈ ధ‌ర‌లు చాలా త‌క్కువ‌.

తాజా మార్పువ‌ల్ల జ‌మ్ముక‌శ్మీర్‌లోని స్థానికుల భూములకు డిమాండ్ పెరుగనుంది. అదే స‌మ‌యంలో జ‌మ్ముక‌శ్మీరేత‌ర భార‌తీయులు అక్క‌డ మంచి అవ‌కాశాలను అందిపుచ్చుకునే చాన్స్ ఉంది. జ‌మ్ముక‌శ్మీర్‌లోని ప్ర‌ధాన ప్రాంతాల్లోగ‌ల భూములు కూడా ట‌య‌ర్ 2 న‌గ‌రాల శివార్ల‌లోని భుముల కంటే తక్కువ ధ‌ర‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. శ్రీన‌గ‌ర్‌లోని ప్ర‌ధాన ప్రాంతం పంథా చౌక్‌లో రూ.2,300 చ‌ద‌ర‌పు అడుగు లెక్క‌ను ఫ్లాట్‌ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ప్రదేశంలో స్థానిక మార్కెట్‌లు, స్టేడియం, కేంద్రీయ విద్యాల‌యం అందుబాటులో ఉన్నాయి. ముబారక్ మండీ ప్యాలెస్ స‌మీపంలోని పాసి ధాకీ ఏరియాలో 1634 చ‌ద‌ర‌పు అడుగుల ఇండిపెండెంట్ హౌస్ ధ‌ర గ‌రిష్టంగా రూ.40 ల‌క్ష‌ల‌కు మించ‌దు. నాన్ మెట్రో క్యాపిట‌ల్ సిటీ అయిన జ‌మ్ములో ఇళ్లు రూ.60 ల‌క్ష‌లకు ల‌భ్య‌మైతే.. మెట్రో న‌గ‌రాలైన ఢిల్లీ, ముంబై త‌దిత‌ర ప్రాంతాల్లో ధ‌ర‌లు ప‌దుల కోట్ల‌లో ఉన్నాయి.

Tags :

Advertisement