Advertisement

  • రంగారెడ్డి జల్లాలో ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ కు భూ కేటాయింపులు

రంగారెడ్డి జల్లాలో ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ కు భూ కేటాయింపులు

By: chandrasekar Tue, 10 Nov 2020 09:43 AM

రంగారెడ్డి జల్లాలో ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ కు భూ కేటాయింపులు


రంగారెడ్డి జల్లాలో ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ కు భూ కేటాయింపులు చేయబడ్డాయి.రాష్ట్ర చరిత్రలోనే భారీ పెట్టుబడి పెట్టిన అమెజాన్‌ సంస్థకు భూ కేటాయింపులు పూర్తయ్యాయి. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ మూడు ప్రాంతాల్లో అలైలబులిటీ జోన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రంగారెడ్డి జల్లాలోని రావిర్యాల ఫ్యాబ్‌ సిటీ లో 52.56ఎకరాలు, మీర్‌ఖాన్‌పేటలో 48.01ఎకరాలు, చందన్‌వెళ్లిలో 34.21ఎకరాలను టీఎస్‌ఐఐసీ కేటాయించింది.

ఈ సంస్థకు వెబ్‌ సర్వీసెస్‌కు ప్రధానంగా విద్యుత్‌ ఎక్కువగా అవసరం కానుండటంతో 220కేవీ సబ్‌స్టేషన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వెబ్‌ సర్వీసెస్‌ డాటా సెంటర్లను ఏర్పాటుచేయాలని అమెజాన్‌ నిర్ణయించింది. 2022 జూన్‌లోగా వీటి నిర్మాణాలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో మరోవైపు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు మరికొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆహార రంగం, ఆహార శుద్ధికి సంబంధించిన పరిశ్రమలు, ఇతర రంగాల పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నట్టు సమాచారం.

Tags :
|

Advertisement