Advertisement

  • భక్తులు లేకుండానే లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ప్రారంభం ..

భక్తులు లేకుండానే లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ప్రారంభం ..

By: Sankar Sun, 19 July 2020 2:37 PM

భక్తులు లేకుండానే లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ప్రారంభం ..



తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్లో ఆషాడ మాసం అనగానే అందరికి గుర్తొచ్చేది బోనాలు ..మతాలకు , కులాలకు అతీతంగా హైదరాబాద్ ప్రజలు ఘనంగా బోనాలు పండుగ నిర్వహిస్తారు ..అయితే ఈ ఏడాది కరోనా కారణంగా భక్తులు లేకుండానే బోనాలు పండుగ జరుగుతుంది ..అయితే ఈ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఆదివారం తెల్లవారుజామునే బలగంప కొనసాగింది. అనంతరం అమ్మవారికి అర్చకులు జల కడవ సమర్పించారు. ఆ తర్వాత ఆలయ కమిటీ తరఫున అధికారికంగా అమ్మవారికి ఒక్క బోనాన్ని సమర్పించింది. సాయంత్రం ఆరు గంటలకు శాంతి కల్యాణం జరగనుంది. సోమవారం పోతరాజు స్వాగతం, రంగం (భవిష్యవాణి) కార్యక్రమం పూర్తయిన తర్వాత పరిమితంగా కమిటీ సభ్యులతో ఘట ఊరేగింపు ఉంటుంది.

కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా బోనాలకు భక్తులను అనుమతించడం లేదు. మరోవైపు పోలీసులు...ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయానికి వచ్చే అన్ని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు కోవిడ్‌ నిబంధనలలో భాగంగా నో ఎంట్రీ సూచికలను ఏర్పాటు చేశారు. నాగుల చింత నుండి లాల్ దర్వాజా, ఓల్డ్ ఛత్రినాక పీఎస్ నుండి లాల్ దర్వాజా, గౌలిపురా లాల్ దర్వాజా రోడ్లు మూసివేశారు..

ఇళ్లలోనే బోనాల సమర్పణకు భక్తులు సిద్ధమయ్యారు. వాస్తవానికి పాతబస్తీలో ఆదివారం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో కేవలం ఆయా ప్రాంతాలలోని దేవాలయాల్లో కమిటీ తరఫున మాత్రమే అమ్మవారికి బోనం సమర్పించనున్నారు.

Tags :
|
|

Advertisement