Advertisement

  • గంగూలీ సమర్ధతను నేను చూసాను ..ఆ పదవికి గంగూలీ తగిన వ్యక్తి ..సంగక్కర

గంగూలీ సమర్ధతను నేను చూసాను ..ఆ పదవికి గంగూలీ తగిన వ్యక్తి ..సంగక్కర

By: Sankar Mon, 27 July 2020 08:38 AM

గంగూలీ సమర్ధతను నేను చూసాను ..ఆ పదవికి గంగూలీ తగిన వ్యక్తి  ..సంగక్కర



అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా వ్యవహరించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తగిన వ్యక్తి అని శ్రీలంక మాజీ క్రికెటర్‌ కుమార సంగక్కర అభిప్రాయ పడ్డాడు. గంగూలీ తెలివితేటలు క్రికెట్‌ పరిపాలనలో ఉపయోగపడతాయని అతను అన్నాడు. ‘నా దృష్టిలో గంగూలీ ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడు. క్రికెటర్‌గా అతని ఘనతలు చూసి మాత్రమే కాకుండా గంగూలీ బుర్రను చూసి నేను అభిమానినయ్యా.

ఐసీసీ పదవిలో ఉన్నవారు ఒక దేశపు బోర్డు గురించి కాకుండా అందరి గురించి, క్రికెట్‌ మేలు గురించి మాత్రమే ఆలోచించాలి. అది గంగూలీ చేయగలడని నా నమ్మకం. అతని ఆలోచనా దృక్పథం అలాంటిది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపిక కాకముందే, పరిపాలనలో, కోచింగ్‌లో రాకముందే గంగూలీ ఏమిటో నేను చూశాను. ఎంసీసీ క్రికెట్‌ కమిటీలో సభ్యుడిగా ఆటగాళ్లందరితో అతను సత్సంబంధాలు నెరపడం అతని సమర్థతను సూచిస్తోంది’ అని సంగక్కర వివరించాడు.

అయితే ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ పడుతున్నట్లు అప్పట్లో వచ్చిన వారతలను గంగూలీ ఖండించిన విషయం తెలిసిందే ..ప్రస్తుతానికి బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉండటానికే ఇష్టపడుతున్నాను ..నా వయస్సు కూడా తక్కువే ముందు రోజుల్లో ఐసీసీ చైర్మన్ పదవి గురించి ఆలోచిస్తా ..ఇప్పుడైతే అలంటి ఆలోచన లేదు అని గంగూలీ అన్నారు ..అయితే తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ గంగూలీ ఇంకో మూడేళ్లు బీసీసీఐ అధ్యక్షుడిగానే ఉండాలని అన్నారు ..గంగూలీ ఉంటె ఇండియన్ క్రికెట్ ఎంతో అభివృద్ధి సాధిస్తుంది అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు

Tags :
|

Advertisement