Advertisement

  • భారతీయ జనతా పార్టీ చార్జ్‌షీట్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్...

భారతీయ జనతా పార్టీ చార్జ్‌షీట్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్...

By: chandrasekar Tue, 24 Nov 2020 4:11 PM

భారతీయ జనతా పార్టీ చార్జ్‌షీట్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్...


భారతీయ జనతా పార్టీపై భగ్గుమన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో మీద బీజేపీ కౌంటర్ ఎటాక్, కమలనాధులు ఇచ్చిన చార్జ్ షీట్ మీద నిప్పులు చెరిగారు. బీజేపీ చేసిన మోసాలకు, ద్రోహాలకు ఆ పార్టీపై 130 కోట్ల మంది చార్జ్ షీట్ వేయాలన్నారు. తెలంగాణభవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్ మాట్లాడారు. ‘బీజేపీ నేతలు గోబెల్స్ కు కజిన్ బ్రదర్స్ లా వ్యవహరిస్తున్నారు. బీజేపీ వాళ్ళ చార్జీ షీట్ గోబెల్స్ డైరీలా ఉంది. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారు. టీఆర్ఎస్ ఎంఐఎం సర్కార్ అని అర్ధ సత్యాలు మాట్లాడారు. ఇక్కడ టీఆర్ఎస్ సర్కారే ఉంది. అక్కడే బీజేపీ ముస్లిం వ్యతిరేకత బయట పడుతోంది. జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటు వాద పార్టీ పీడీపీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది నిజం కాదా?. అసలు మా మీద చార్జీ షీట్ వేసే హాక్కు బీజేపీకి ఎవరిచ్చారు?’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలో బీజేపీకి 50 ప్రశ్నలు సంధించారు.

‘మా మీద చార్జ్ షీట్ ఎందుకు? కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ఆరేళ్లలో ప్రగతి పథాన దూసుకుపోతున్నందుకా? 2000 సంవత్సరంలో ఏర్పాటైన రాష్ట్రాల కంటే 2014 లో ఏర్పాటైన తెలంగాణ అన్నింటా ముందుకు దూసుకు పోతున్నందుకా? బీజేపీ మీద చార్జీ షీట్ వేయాలంటే చాలా అంశాలు ఉన్నాయి. నా ప్రశ్నలకు సూటిగా, సుత్తి లేకుండా కిషన్ రెడ్డి, మిగతా కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలి. హైదరాబాద్ కు రాజ్యాంగబద్దంగా ఇవ్వాల్సినవి కాకుండా ఒక్క పైసా అదనంగా కేంద్రం నుంచి ఇచ్చారని చెప్పగలరా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఓ విధంగా చెప్పాలంటే బీజేపీ మీద చార్జ్ షీట్ వేయాలన్నారు. ‘లాభాల్లో ఉన్న కేంద్ర సంస్థలను అమ్ముతున్నందుకు బీజేపీ మీద చార్జీ షీట్ వేయాలి. బీజేపీకి అవకాశం ఇస్తే చార్మినార్, గోల్కొండ లను కూడా డిజిన్వెస్టుమెంట్ చేస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ దేశ ప్రయోజనాల కోసం కాదు. కొందరు గుజరాతీ పెద్దల కోసం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మోడీ చెప్పారు. ఆరేళ్లకు 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వని మోదీపై 12 కోట్ల మంది నిరుద్యోగులు చార్జీ షీట్ వెయ్యాలి. మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లలో ఎన్ని సున్నాలు ఉన్నాయో కేంద్రమంత్రులకు తెలుసా? ప్రతీ ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానని వేయనందుకు ఛార్జీ షీట్ వేయాలి. మొత్తం 132 కోట్ల చార్జ్ షీట్లు వేయాలి బీజేపీ మీద.’ అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :
|
|
|

Advertisement