Advertisement

  • ప్రతి ఒక్క కుటుంబం ఆరు మొక్కలు నాటాలి ..కేటీఆర్ పిలుపు

ప్రతి ఒక్క కుటుంబం ఆరు మొక్కలు నాటాలి ..కేటీఆర్ పిలుపు

By: Sankar Fri, 26 June 2020 4:04 PM

ప్రతి ఒక్క కుటుంబం ఆరు మొక్కలు నాటాలి ..కేటీఆర్ పిలుపు



తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చాడు ..ఇంట్లో కొంచెం స్థలం ఉన్న మొక్కలు నాటేందుకు ప్రయత్నించాలని అన్నాడు అంతేకాకుండా ప్రతిఒక్కరు దీనిని ఒక బాధ్యతలాగ తీసుకుంటే తెలంగాణ పచ్చదనంతో కలకలాడుతుంది అని అన్నాడు .. సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలోకెల్లా ఆదర్శవంతమైన నియోజకవర్గం చేసే బాధ్యత తనదన్నారు..

మరోవైపు తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐదేళ్ల క్రితం మీకు పంట పండించడం వస్తుందా అని విమర్శించిన వాళ్లే ఇప్పుడు నోరెళ్లబెట్టి చూస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా మారిందని ఎఫ్‌సీఐ ప్రశంసించిందన్నారు. హరిత హారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొక్కలు నాటిన కేటీఆర్.. కరోనా సంక్షోభ సమయంలోనూ సంక్షేమం ఆగలేదన్నారు.

రైతు బంధు కింద నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.రైతు బందును ఇంత పకడ్బందీగా అమలు చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రము తెలంగాణ అని అన్నాడు ..కరోనా వచ్చి ఆర్ధిక వ్యవస్థకు ఎన్ని ఇబ్బందులు ఉన్న రైతు బంధు మాత్రం అనుకున్న సమయానికి రైతుల అకౌంట్లో వేశామని అన్నారు ..ఇక ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Tags :
|
|
|
|

Advertisement