Advertisement

  • దుబ్బాక ఫలితం పై స్పందించిన కేటీఆర్...ఏం తప్పులు చేశామో సమీక్షించుకుంటాం...

దుబ్బాక ఫలితం పై స్పందించిన కేటీఆర్...ఏం తప్పులు చేశామో సమీక్షించుకుంటాం...

By: chandrasekar Tue, 10 Nov 2020 5:49 PM

దుబ్బాక ఫలితం పై స్పందించిన కేటీఆర్...ఏం తప్పులు చేశామో సమీక్షించుకుంటాం...


దుబ్బాక స్థానానికి హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. దుబ్బాక ఎన్నిక ఫలితాలు విడుదలైన వెంటనే తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఫలితం తాము ఆశించిన విధంగా రాలేదని అన్నారు. ఆ స్థానంలో ప్రజలు ఇచ్చిన తీర్పే తమకు శిరోధార్యం అని అన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకారం తమ పని తాము చేసుకుంటూ ముందుకెళ్తామని పేర్కొన్నారు.

ఒక రకంగా ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు తమకు, తమ పార్టీ నేతలకు ఓ హెచ్చరిక లాంటిదని అన్నారు. తప్పకుండా ఈ తీర్పును సమీక్షించుకుంటామని పేర్కొన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్‌కు ఓటు వేసిన 60 వేల పైచిలుకు ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఈ ఆరేళ్లలో ఎన్నో విజయాలను మేం గెల్చుకున్నాం. ఇప్పుడు ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. ఈ ఓటమి మా పార్టీ నేతలకు ఓ అప్రమత్తత లాంటిది. మేం ఏం తప్పులు చేశామో కూర్చొని సమీక్షించుకుంటాం. ఈ తీర్పును తప్పకుండా సమీక్షించుకుంటాం. పార్టీ గెలుపుకోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు. ఎప్పుడూ విజయాలకు గర్వపడం. అపజయాలకు కుంగిపోము.’’ అని కేటీఆర్ స్పష్టం చేసారు.

Tags :
|
|
|

Advertisement