Advertisement

  • రాజకీయాలకు ఇంకా నాలుగేళ్లు ఉంది .. ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

రాజకీయాలకు ఇంకా నాలుగేళ్లు ఉంది .. ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

By: Sankar Thu, 09 July 2020 4:34 PM

రాజకీయాలకు ఇంకా నాలుగేళ్లు ఉంది .. ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం



తెలంగాణ ప్రభుత్వం కరోనా ను కట్టడి చేయడంలో విఫలం అయింది అని తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల మీద కౌంటర్ ఎటాక్ చేసారు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ..ఈ ఆపత్కాలంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వంపై బురద చల్లడం కేవలం పైశాచికానందం తప్ప సాధించేదేమీ ఉండదన్నారు..తెలంగాణలో కరోనా టెస్టులు, చేయడం లేదు.. డేటా దాస్తున్నారు.. కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యం చెందింది’అని విపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయని, అదే నిజమైతే మరణాలు సంఖ్య ఎలా దాచగలమని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో కరోనాతో 98 శాతం రోగులు కోలుకుంటున్నారని, దేశవ్యాప్తంగా 3 శాతం మరణాల రేటుంటే.. తెలంగాణలో 2 శాతం మాత్రమే ఉందని, ఇది ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ కట్టడి చర్యలు కాదా అని ప్రశ్నించారు. ప్రపంచంలో కరోనా బారిన పడని దేశం అంటూ లేదన్నారు. వ్యాక్సిన్‌ వచ్చే వరకు లాక్‌డౌన్‌ విధించి ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ వైరస్‌ వల్ల ఎంతమంది చనిపోతారో తెలియదు గానీ, ఆర్థిక ఇబ్బందులతో ఎన్ని ఉద్యోగాలు పోతాయో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ప్రజలు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు.

అందరికి జీవితం.. జీవనోపాధి ముఖ్యమని, కరోనాతో సహజీవనం చేస్తూనే ఉపాధి, అభివృద్ధి సాధించాలని మంత్రి కోరారు. ప్రతిపక్షాలు కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కరోనాతో రాజకీయాలు చేయడం ఇది సరైన సమయం కాదని, ఇంకా నాలుగేళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడక్కడా లోపాలు లేవని తాను అనడం లేదని, వాటిని సరిదిద్దేందుకు సూచనలు ఇవ్వాలని విపక్షాలను కోరారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కరోనాకు ఏదో చేయాలని అనుకునే కంటే, అందరూ బాధ్యతగా మెలగాలని కేటీఆర్‌ కోరారు ..ఆరోగ్య రంగంలో మన దేశానికి మంచి అవకాశాలు రాబోతున్నాయని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫార్మారంగంపై మన రాష్ట్రం నుంచి పనిచేస్తున్న నాలుగు కంపెనీలు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. 78 శాతం వైద్య పరికరాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, కానీ అందులో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :
|
|
|
|

Advertisement